"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
==ఉభయగోదావరిజిల్లాలు-కాటన్==
పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్ది వరకు [[అతివృష్టి]] వలన, [[వరద]]ముంపుకు లోనగుచు, అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు. అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు. [[ధవళేశ్వరం]] ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పం చెప్పునప్పుడు
{{left margin|5em}}
 
<poem>
'''నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః'''
'''స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం'''
</poem>
</div>
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)
 
అని పఠించేవారు.<ref>{{Cite wikisource|title=లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు|chapter=తెలుగు భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ |author=మండలి బుద్ధ ప్రసాద్|year=2010 }}</ref> అంతటి గౌరవాన్నిపొందాడు. ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న [[చిరంజీవి]] కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్టను మరింతగా అభివృద్ధి పరచి, దృఢంగా చేయబడి కట్టబడింది.
 
==కాటన్‍మ్యూజియం==
[[File:Arthan kaaTan.jpg|right|thumb|ఆర్ధర్ కాటన్ విగ్రహం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2721155" నుండి వెలికితీశారు