మెసొపొటేమియా నాగరికత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 239:
=== జిగ్గురట్లు ===
జిగ్గురట్లు అనేవి అతిపెద్ద సూచ్యాకార [[గుడి]] గోపురాలు. ఇవి ప్రాచీన మెసొపొటేమియా లోయ, పాశ్చాత్య ఇరాను పీటభూమిలో నిర్మించబడ్డాయి. వేదికల ఆకృతిలో మెట్ల పిరమిడు ఆకృతిలో ఒకొక్క స్థాయిగా (అంచు) దిగుతూ ఉంటుంది. మెసొపొటేమియాలో, సమిపప్రాంతాలలో 32 జిగ్గురట్లు ఉన్నాయి. వీటిలో 38 [[ఇరాక్|ఇరాకు]]లో, 4 [[ఇరాన్|ఇరాన్]]లో ఉన్నాయి. ముఖ్యమైన జిగ్గురట్లు నాసిరియా, [[ఇరాక్|ఇరాకు]] వద్ద " గ్రేట్ జిగ్గురటు ఆఫ్ ఉరు, [[బాగ్దాద్|బాగ్దాదు]], ఇరాకు వద్ద " జిగ్గురట్ ఆఫ్ అకర్ కుఫ్, [[ఖజకిస్తాన్]] ఇరానులోని చొఘ జంబిలు, ఈ మధ్యనే కనుగొనబడిన - కాషంసు, ఇరాను వద్ద సియల్కు ఇతరమైనవి ఉన్నాయి. జిగ్గురట్లను సుమేరియన్లు, బాబిలోనియన్లు, ఎలం మైట్లు, అస్సిరియన్లు స్థానిక మతాలకు స్మారకాలుగా నిర్మించారు. ఉబైదు కాల వేదికలు<ref name="Crawford, page 73">క్రాఫోర్డ్, పేజీ 73</ref> క్రీ.పూ. 4 వ సహస్రాబ్ధి నుండి క్రీ.పూ.6వ శతాబ్దం మధ్యకాలంలో అధికరించాయి. చాలా పిరమిడ్లలా కాకుండా జిగ్గురట్ల పైభాగం చదరంగా ఉంటుంది. సోపాన పిరమిడు శైలి ఆరంభ రాజ్యవంశ కాలం ముగింపు నుండి ఆరంభం అయ్యింది.<ref>క్రాఫోర్డ్, పేజీ 73-74</ref> నిర్మాణం తరుగుతూ పోతున్న మడతలులాగా దీర్ఘచతురస్రం, దీర్ఘవృత్తం, లేదా చతురస్ర వేదికలో నిర్మించారు. జిగ్గురటుకు సూచ్యాకార ఆకృతి ఉంది. సూర్యరశ్మిలో కాల్చిన [[ఇటుక]]లు జిగ్గురటులో ప్రధానంగా వాడబడిన కాల్చిన ఇటుక ముఖభాగం బయటకు కనిపించేటట్లు పెడతారు. ఈ ముఖభాగాలను అనేక రంగులలో ఉంచుతారు. ఇవి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కూడా కలిగి ఉండవచ్చు. రాజులు కొన్నిసార్లు వారి పేర్లను మెరుస్తున్న ఇటుకల మీద చెక్కించు కుంటారు. మడతల సంఖ్య 2-7 వరకు ఉంటాయి. [[శిఖరం]] వద్ద విగ్రహం లేదా గోపురం ఉంటుంది. విగ్రహం దగ్గరకు వెళ్ళటానికి మెట్ల క్రమాన్ని జిగ్గురటు ఒక వైపున ఉంచుతారు లేదా గుండ్రంగా ఉన్న మెట్లను క్రింద నుంచి శిఖరం వరకు ఉంచుతారు. జిగ్గురటు నిర్మాణం కొండలను పోలినట్లు ఉండాలని సూచించారు. కానీ చాలా కొద్దిగా వ్రాతపూర్వక, పురావస్తుపరిశోధనా ఆధారం ఈ పరికల్పనకు సహకారం ఇస్తుంది.
==== జిగురెటు నిర్మాణం ====
ఉరు వద్ద నున్న ఉరు-నమ్ము జిగ్గురటు ఆకృతిని మూడు-స్థాయిలలో నిర్మించారు. ప్రస్తుతం వాటిలో రెండు మాత్రమే సజీవంగా ఉన్నాయి. మొత్తం మట్టి ఇటుక<nowiki/>లతో ఉన్న కట్టడం నిజానికి బట్టీలలో కాల్చిన ఇటుకల మొత్తాన్ని ముఖభాగంగా ఇచ్చారు మొదటి దిగువ స్థాయిలో 2.5 మీ ఉండగా రెండవ స్థాయిలో 1.15 మీ రెండవ దాని మీద వేదిక ఉంటుంది. ఈ కాల్చిన ప్రతి ఇటుక మీద ఒకే రాజు ముద్ర ఉంటుంది. వేదికల ఏటవాలు గోడలు ఆధారంగా ఉన్నాయి. పైకి వెళ్ళడానికి మార్గంగా మూడు అంతస్తుల మెట్ల మార్గం ఉంటుంది. ఇవన్నీ దిగిన తరువాత మొదటి - రెండవ వేదికల మధ్య ద్వారం ఉంటుంది. మొదటి వేదిక ఎత్తు 11 మీ అయితే రెండవ వేదిక ఎత్తు 5.7 ఎత్తు ఉంటుంది. మూడవ వేదిక పునఃనిర్మాణాన్ని జిగ్గురటు పురావస్తు పరిశోధకుడు నిర్మించి ([[లెనార్డు వూల్లె]]) గోపురం ఉంచారు. స్చోగా జంబిలు జిగ్గురటు పురావస్తు శాస్త్రజ్ఞులు అధిక మొత్తంలో నీటిమోక్కల తాళ్ళను కనుగొన్నారు. ఇవి ప్రధాన జిగ్గురటుకు అడ్డంగా ఉన్నాయి. మట్టి ఇటుకల ముద్దను దగ్గరకు కట్టబడినాయి.
ప్రాచీన మెసొపొటేమియన్లు నియరు ఈస్టు కేంద్రభాగంలో ఉన్నారు. ప్రస్తుతం అవి ఇరాకు, [[సిరియా]], టర్కీ లోని కొన్ని భాగాలలో ఉన్నాయి. ప్రాచీన మెసొపొటేమియా టిగ్రిసు, యూఫ్రేట్సు నదుల మధ్య ఉంది. సాహిత్య పరంగా మెసొపొటేమియా అర్ధం “రెండు నదుల మధ్య ఉన్న భూభాగం”. మెసొపొటేమియా దక్షిణ భాగం సుసంపన్నమైన అభివృద్ధి కలిగి ఉంది. ఎందుకంటే మెసొపొటేమియాలోని ఎండాకాలాలు, చలికాలాలు ఉంటాయి. మెసొపొటేమియాలో మొదటి నగరం ఎరిడు.
 
==== నదులు ====
మెసొపొటేమియాలో నదులు జీవితం కొనసాగటానికి, ఆహారం పొందడానికి సహకరిస్తాయి. మెసొపొటేమియన్లు మట్టిని, భూములను తడుపుకొని వ్యవసాయం చేయటానికి నదులు సహకరించాయి. [[నదులు]] అపాయకారులుగా కూడా ఉన్నాయి. వరదలకు కారణంగా పంటలు, నాటిన గింజలు కొట్టుకు పోయేవి. మెసొపొటేమియన్ల జీవనశైలి మార్షు అరబ్బుల శైలికి సమానంగా ఉంది. వీరు టిగ్రిసు, యూఫ్రేట్సు నదుల మీద ఆధారపడి, నదీజలాలను వారికి సహాయపడేటట్లు వాడుకుంటారు. వర్షాకాలంలో కొన్నిసార్లు నదులు కొంతవరకు భూములను ముంచెత్తుతాయి. అందుచే ఎత్తులో ఉన్న భూభాగాన్ని నీటితో తడపరు. ఒకవేళ ఇది జరిగితే మెసొపొటేమియన్లు ఇతర ప్రజల ఇళ్ళకు వెళ్ళటానికి లేదా వరద ప్రాంతాలు కాని చోట్లకు వెళ్ళటానికి పడవలను ఉపయోగించవలసి వస్తుంది. నదులు మెసొపొటేమియన్ల జీవితాన్ని అనేకవిధాలుగా ప్రభావితం చేసాయి.