ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 37:
::::{{u|Arjunaraoc}} గారూ, ఈ అంశంపై సముదాయంలో ఏ రకమైన ఏకాభిప్రాయం లేదు. ఫలానా ప్రాజెక్టు వల్ల తెలుగు వికీపీడియాకు లాభమా కాదా అన్నది మీరు నిర్ణయించుకుని, దాని మీద పనిచేస్తున్న ఓ కొత్త వాడుకరికి దాదాపు ఓ నిర్ణయం తరహాలో చెప్పేస్తున్నారు. ప్రాజెక్టు ఏమీ ప్రయోజనకరం కాదని కానీ, నష్టమని కానీ ఇప్పటిదాకా సముదాయంలో ఓ ఏకాభిప్రాయం లేదు. ఇలా వాడుకరి చర్చా పేజీలో చర్చించుకోవడం బాగోలేదు. నిరుత్సాహజనకంగా ఉంటుంది వారికి. కాబట్టి దయచేసి ఇలాంటి చర్చలు చేసేముందు, అది కూడా ఓ సలహాగానో, సలహాకన్నా రెండు అడుగుల ఎత్తులోనో కొత్తవారికి ప్రాజెక్టు గురించి చెప్పేముందు సముదాయంలో చర్చించుకుని ఆయా అభిప్రాయాలపై నిర్ణయాలు తీసుకుందామని {{u|B.K.Viswanadh}} గారి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:39, 7 సెప్టెంబరు 2019 (UTC)
::::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు ఆయనకు అనిపించిన అభిప్రాయం సలహాగా చెప్పారు. అందులో నాకు తప్పేమీ కనిపించడం లేదు. శ్రీలేఖ గారు [[వాడుకరి:B.K.Viswanadh|విశ్వనాథ్]] గారితో చర్చించే ఈపని చేస్తున్నందున వారికి ఈ పని మీద ఆసక్తి ఉండే కొనసాగిస్తున్నారని భావిస్తున్నాను. అర్జున గారి అభిప్రాయం వల్ల ఆమె పనికి ఎటువంటి ఆటంకం కలగడం లేదని భావిస్తాను. వికీకి కావల్సింది స్వేచ్ఛగా, ఇష్టంగా, కొన్ని నియమాలకు లోబడి పనిచేసేవారు. అటువంటి వారు ఏ పని చేసినా నాకు సంతోషమే. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 18:09, 7 సెప్టెంబరు 2019 (UTC)
:ఒక వాడుకరిని "''మీరు ఫలానా పని కూడా చేస్తే చాలా బాగుంటుంది''" అని ప్రోత్సహించవచ్చేమో గానీ, "''నా దృష్టిలో ఈ పని కొనసాగించటం వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు.''" అని చెప్పడం ఆ వాడుకరిని నిరుత్సాహపరచడమే నని నేను అనుకుంటున్నాను. ఒక వ్యాసం పనికొచ్చేదా కానిదా అనేది వ్యక్తి దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. వికీ నియమాలను అనుసరించి రాసేదేదీ కాదు వికీకనర్హం అని నా అభిప్రాయం. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, మీరు చెప్పినది మీ అభిప్రాయమే, సందేహం లేదు. కానీ అది అవతలి వారిని నిరుత్సాహపరుస్తుంది అనేదాన్ని మీరు గమనించాలి. బూతు అంచుల్లో తచ్చిట్లాడే వ్యాసాలను సంరక్షిస్తే, సుదుద్దేశంతో రాయదలచిన అజ్ఞాతలు రాయరేమో అని ఆరాటపడి అభ్యంతరపెట్టిన మీరు, ప్రస్తుత చర్చాంశమైన వ్యాసం పట్ల వెలిబుచ్చిన అభిప్రాయం అంత సబబుగా లేదు. ఎవరికి నచ్చిన అంశం గురించి వారిని రాయనివ్వండి. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు చెప్పినట్టు నియమాలకు లోబడి పనిచేసినంతవరకు ఏ పని జరిగినా మనం సంతోషించాల్సిందే కదా. లేదూ అసలు వికీలో ఈ ప్రాజెక్టు యోగ్యత పట్ల మీకు అభ్యంతరముంటే, [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు చెప్పినట్టు వేరే అనువైన చోట చర్చింస్తే బాగుంటుంది .__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:14, 8 సెప్టెంబరు 2019 (UTC)