ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
::::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు ఆయనకు అనిపించిన అభిప్రాయం సలహాగా చెప్పారు. అందులో నాకు తప్పేమీ కనిపించడం లేదు. శ్రీలేఖ గారు [[వాడుకరి:B.K.Viswanadh|విశ్వనాథ్]] గారితో చర్చించే ఈపని చేస్తున్నందున వారికి ఈ పని మీద ఆసక్తి ఉండే కొనసాగిస్తున్నారని భావిస్తున్నాను. అర్జున గారి అభిప్రాయం వల్ల ఆమె పనికి ఎటువంటి ఆటంకం కలగడం లేదని భావిస్తాను. వికీకి కావల్సింది స్వేచ్ఛగా, ఇష్టంగా, కొన్ని నియమాలకు లోబడి పనిచేసేవారు. అటువంటి వారు ఏ పని చేసినా నాకు సంతోషమే. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 18:09, 7 సెప్టెంబరు 2019 (UTC)
:ఒక వాడుకరిని "''మీరు ఫలానా పని కూడా చేస్తే చాలా బాగుంటుంది''" అని ప్రోత్సహించవచ్చేమో గానీ, "''నా దృష్టిలో ఈ పని కొనసాగించటం వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు.''" అని చెప్పడం ఆ వాడుకరిని నిరుత్సాహపరచడమే నని నేను అనుకుంటున్నాను. ఒక వ్యాసం పనికొచ్చేదా కానిదా అనేది వ్యక్తి దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. వికీ నియమాలను అనుసరించి రాసేదేదీ కాదు వికీకనర్హం అని నా అభిప్రాయం. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, మీరు చెప్పినది మీ అభిప్రాయమే, సందేహం లేదు. కానీ అది అవతలి వారిని నిరుత్సాహపరుస్తుంది అనేదాన్ని మీరు గమనించాలి. బూతు అంచుల్లో తచ్చిట్లాడే వ్యాసాలను సంరక్షిస్తే, సుదుద్దేశంతో రాయదలచిన అజ్ఞాతలు రాయరేమో అని ఆరాటపడి అభ్యంతరపెట్టిన మీరు, ప్రస్తుత చర్చాంశమైన వ్యాసం పట్ల వెలిబుచ్చిన అభిప్రాయం అంత సబబుగా లేదు. ఎవరికి నచ్చిన అంశం గురించి వారిని రాయనివ్వండి. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు చెప్పినట్టు నియమాలకు లోబడి పనిచేసినంతవరకు ఏ పని జరిగినా మనం సంతోషించాల్సిందే కదా. లేదూ అసలు వికీలో ఈ ప్రాజెక్టు యోగ్యత పట్ల మీకు అభ్యంతరముంటే, [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు చెప్పినట్టు వేరే అనువైన చోట చర్చింస్తే బాగుంటుంది .__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:14, 8 సెప్టెంబరు 2019 (UTC)
::స్పందించిన [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[User:Chaduvari|చదువరి]] గార్లకు ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయ్ంవిషయం తెలియచేయాలనుకొంటున్నాను. పుడుతూనే ఎవరూ పరిగెత్తరు. పరుగెత్తాలనుకున్నా పడుతూ ఉంటారు.అలాగే కొత్త వాడుకరుల స్వభావం ఏదో అత్రంగా రాయాలనుకోవడం. వారు రాస్తూ నేర్చుకోవాలి తప్ప నేర్చుకొనే రాయాలనుకోకూడదు, నియమాలు, పాలసీల విషయంలోనూ అంతే, రాస్తూ మెల్లగా అన్నీ తెలుసుకుంటారు కాని తెలుసుకొని వికీలో ప్రవేశించరు. @[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు ఆమెకు మెసేజ్ పెట్టారు కనుక పని ఆపి నాతో సంప్రదించారు. అంటే పని ఆటంకం జరిగింది. నేనైతే రాయమనే ప్రోత్సహిస్తాను కాని ఈ చర్చల బట్టి వారి నిర్ణయం ఆధారపడి ఉంటుంది.ధన్యవాదాలు...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 05:42, 8 సెప్టెంబరు 2019 (UTC)