పంక్తి 41:
::: చర్చలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. కొత్త వాడుకరులకు మార్గదర్శకం చేయటం అనుభవమున్న ప్రతి నిర్వాహకుని కర్తవ్యం. ఇక [[వాడుకరి:Sri Lekha Pathakamuri]] గారిని నిరుత్సాహపరిచానో లేదో ఆమె స్పందించకపోయేసరికి తెలియదు. ఒకవేళ నేను నిరుత్సాహపరిచానని అనుకొంటే, మిగతావారు ఉత్సాహపరిచే పని అంటే ఈ ప్రాజెక్టు కొనసాగించటం ఎందుకువిలువైనదో తెలియచేయవచ్చు కదా. ఇక [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు, వికీమీడియా ఫౌండేషన్ నుండి ధనం పొంది నిర్వహించిన ప్రాజెక్టు సమన్వయకునిగా సమీక్ష చేయటం కనీస బాధ్యత. ఇప్పటికే కొన్ని సార్లు సూచించడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికైనా వారు చర్యతీసుకుంటారని ఆశిస్తాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:49, 9 సెప్టెంబరు 2019 (UTC)
::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు ఈ ప్రాజెక్టు పూర్తి అయినది. దీని వలన ఉపయోగాలు ప్రాజెక్టు పేజీలో ఉదహరిచబడినవి. ప్రాజెక్టు సంభందించినంతవరకూ ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా మార్పులు చేస్తే దానర్ధం ప్రాజెక్టు కొనసాగిస్తున్నట్టు కాదు. వారి సొంత ఆశక్తితో మార్పులు చేస్తున్నట్టే. కొత్త వాడుకరులకు మార్గ నిర్దేశం చేయడం వేరు నిరుత్సాహపరచడం వేరు. ధనం పొంది నిర్వహించిన ప్రాజెక్టు అంటున్నారు. ధనం నాకు ఉచితంగా ఇవ్వలేదు. ఖర్చులకొరకు ఇచ్చినది. అదీ ఒక సంవత్సర కాలం వరకూ మాత్రమే. నేను వికీలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చర్చలే అవసరం లేదు. ప్రాజెక్టు నిజంగా అనవసరం అని మెజారిటీ సభ్యుల ద్వారా తెలియచేయగలిగితే ఖర్చుచేసిన మొత్తం ధనం తిరిగి వికీమీడియా పౌండేషన్ వారికి మీ ద్వారానే అందచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతమూ లేదు.[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 04:35, 9 సెప్టెంబరు 2019 (UTC)
::: ఇది మార్గదర్శకం చేయడం కాదు, కాబోదు. పదుల సంఖ్యలో వికీపీడియన్లను తీసుకువచ్చి, కనీసం పదిమందిని ప్రోత్సహించి నిలబెట్టిన అనుభవంతో చెప్తున్నాను. ఒకవేళ {{u|arjunaraoc}} గారే గనుక "మీకు పుస్తకాలంటే ఆసక్తి ఉన్నట్టుంది. ఇదిగో ఫలానా పద్ధతిలో పుస్తకాలుపుస్తకాల గురించి రాయవచ్చు, అలా రాస్తే ఆయా పుస్తకాల గురించి పదిమందికీ చెప్పినవారవుతారు" అనే ఉంటే అది ప్రోత్సాహం అవుతుంది. వికీకి వచ్చిన కొత్తల్లో నన్ను రాజశేఖర్ గారు ప్రోత్సహించారు. అప్పుడు ఆయన చేసింది ఫలానా చేస్తే బావుంటుందని, ఫలానా చేయడం నియమాల ప్రకారం తప్పు అని, అంతేకానీ ఫలానా చేయడం నియమాల ప్రకారం తప్పు కాదు కానీ వికీకి పెద్ద ప్రయోజనం లేదు అనలేదు. అనే ఉంటే, నా ఆసక్తులు మీకు ప్రయోజనకరం కానప్పుడు నేనెందుకు ఇక్కడ, సెలవు అని వెళ్ళిపోయేవాడిని. పైన చదువరి గారు గుర్తుచేసినట్టు పెద్దలకు మాత్రమే వ్యాసాలలో అజ్ఞాతలు రాసే స్వేచ్ఛ గురించి మాట్లాడే మనిషే ఇక్కడ ఫలానా ప్రాజెక్టులో కొత్తవాడుకరి చేస్తున్న పని తనకు ప్రయోజనకరంగా అనిపించకపోవడం వల్ల "ఈ పని కొనసాగించటం వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు." అంటున్నారంటే రెండు వాదనలు ఒకే సదుద్దేశంతో చేశారని అనుకోలేకపోతున్నాను. ఈ ప్రాజెక్టుకు సముదాయానికి విలువైనదా కాదా అన్నది ప్రశ్న కాదు, పైగా ఈ ప్రశ్న ముందే ఒక తీర్పులా తీర్చిచి ఇప్పుడు, కొత్తవాడుకరి పేజీలో కాదు అడగాల్సింది. ఈ జాబితాలో ఆ అమ్మాయికి ఇష్టమైతే కొన్ని పుస్తకాలు చేర్చడం వల్ల ప్రాజెక్టుకి నష్టం ఏమీలేదు. పైగా అసలంటూ ఒక మనిషి అలా వికీపీడియా వాతావరణం అలవరుచుకుంటూ ఉంటే రేపన్న రోజు మిగిలిన వ్యాసాల్లోనూ పనిచేసేలా ఉత్సాహపరచవచ్చు.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:44, 9 సెప్టెంబరు 2019 (UTC)