కదలడు వదలడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి విఠలాచార్య
* నిర్మాతలు: కుదరవల్లి సీతారామస్వామి, గుత్తా సుబ్బారావు
==కథ==
<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @50 కదలడు వదలడు |url=http://www.andhrabhoomi.net/content/flashback50-66 |accessdate=9 September 2019 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=6 July 2019}}</ref>==కథ==
అవంతీ రాజ్యప్రభువు అనంగపాలుడు (ధూళిపాళ). పట్టపురాణి వినుత దేవి (హేమలత). చిన్నరాణి సరితాదేవి (ఛాయాదేవి). యువరాజు విక్రమసింహుని (మాస్టర్ విశ్వేశ్వర్) పుట్టినరోజు సందర్భంగా మహా మంత్రి చార్వాకుడు (ముక్కామల), రాజుగారి బావమరిది, చిన్నరాణి సోదరుడు భుజంగరాయలు (రామదాసు), ఉప సేనాధిపతి డిండిమవర్మ (త్యాగరాజు) తమ పిల్లలచే యువరాజుకు బహుమతులు అందచేస్తారు. వాటిలో ఒక కీలుగుర్రం బొమ్మ ద్వారా యువరాజుకు ప్రమాదం జరగబోగా సేనాధిపతి వీరసేనుడు (మిక్కిలినేని) రక్షిస్తాడు. యువరాజును అంతం చేయడానికి దుష్టులు చార్వాకుడు, భుజంగరాయలు, డిండిమవర్మలు కుట్ర పన్నుతారు. దాని ఫలితంగా వీరసేనునితో అక్రమ సంబంధం ఉందని పట్టపురాణిని అనుమానించిన మహరాజు, ఇద్దరికీ మరణదండన విధిస్తాడు. ఆ శిక్షనుంచి తప్పించుకొన్న వీరసేనుడు -మహారాణి, యువరాజును రాజ్యానికి దూరంగావుంచి కాపాడతాడు. ఒక సామాన్య యువకునిగా, సాహసవంతునిగా పెరిగి పెద్దవాడైన విక్రముడు.. తల్లి, సేనాపతి ద్వారా నిజం తెలుసుకొంటాడు. అవంతీ రాజ్యానికి వెళ్లి అక్కడ మంత్రి కుమారుడు కిరీటి (సత్యనారాయణ)తో తలపడి అతన్ని ఓడిస్తాడు. రాకుమారుడు (చిన్నరాణి కుమారుడు) వినోదవర్మ (రామకృష్ణ), భుజంగరాయలు కుమార్తె మధుమతి (జయలలిత)ని ప్రేమిస్తాడు. అంతకుముందే కనె్నతీర్థం వద్ద విక్రముని (ఎన్‌టి రామారావు) పరాక్రమం చూసి మెచ్చిన మధుమతి, అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. వారిరువురూ పరస్పర అనురాగబద్ధులై ఉంటారు. మధ్యలో డిండిమవర్మ కుమార్తె సుకన్య (విజయలలిత) విక్రమునిపై ప్రేమ పెంచుకోవటం కథ పలు మలుపులు తిరుగుతుంది. కథ నడుస్తుండగా రాజ్య కుట్రలతో మహారాజు, చిన్నరాణి, భుజంగరాయలు బందీలవుతారు. సింహాసనం అధిష్టించి మధుమతిని వివాహం చేసుకోవాలనే కిరీటి ప్రయత్నాలను విక్రముడు పలు ఉపాయాలతో ఎదుర్కొంటారు. దుష్టుల ఆటకట్టించి మహారాజుకు తన తల్లి నిర్దోషిత్వం నిరూపిస్తాడు విక్రముడు. మధుమతిని చేపట్టి సింహాసనం అధిష్టించటంతో కథ సుఖాంతమవుతుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @50 కదలడు వదలడు |url=http://www.andhrabhoomi.net/content/flashback50-66 |accessdate=9 September 2019 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=6 July 2019}}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/కదలడు_వదలడు" నుండి వెలికితీశారు