కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

బాటు ఆర్కైవు చేసిన గత కూర్పు లోని లింకును మళ్ళీ చేర్చాను, అందులోని తేదీ ఆకృతిని సరిదిద్ది.
చి డిఎల్ఐ లింకు ఉపయోగం లేదు కనుక తొలగించుతున్నాను.
పంక్తి 172:
"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. [[మదనపల్లె]]లో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ [[మద్రాసు]] వచ్చాడు. ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే [[1923]] [[జూలై 12]] న లక్ష్మణరావు మరణించాడు.
 
అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. తర్వాత [[కాశీనాధుని నాగేశ్వరరావు]] మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలో ప్రచురించాడు.<ref>{{Cite web|url=http://www.new.dli.ernet.in/|title=ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 2 పునర్ముద్రణ నకలు (DLIలో)|last=|first=|date=|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20170909022047/http://www.new.dli.ernet.in/|archive-date=9 Sep 2017|access-date=24 Sep 2010}}</ref><ref>{{Cite web |url=https://archive.org/search.php?query=%22%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%20%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81%22 |title=ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటాలు (DLI పుస్తకాల ఆర్కైవ్ నకలు) |}}</ref> తరువాత డాక్టర్ [[బెజవాడ గోపాలరెడ్డి]] అధ్యక్షతన ఏర్పడిన [[తెలుగు భాషా సమితి]] ఆ కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక, విషయానుక్రమంగా పద్నాలుగు సంపుటాలు ప్రచురించింది. ఈ సంస్థ 1986 లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] లో విలీనమైంది. ఆ తరువాత [[ఉర్లాం]] జమీందారు అయిదు సంపుటాలలో "[[ఆంధ్ర విజ్ఞానం]]" అని [[1938]]-[[1941]] కాలంలో ప్రచురించాడు.
 
సాంప్రదాయక పద్దతిలో విజ్ఞానసర్వస్వం కృషి కొనసాగిస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం తో పోల్చితే, ప్రపంచం నలుమూలలనుండి ఆధునిక అంతర్జాల సౌలభ్యంతో వందల మంది సాధారణ తెలుగు భాషాభిమానులు 2003 లో మొదలుకొని నిర్మిస్తున్న [[మొదటి పేజీ|తెలుగు వికిపీడియా]] విలక్షణమైనదని చెప్పవచ్చు.