కాలువ మల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''కాలువ మల్లయ్య''' తెలుగు కథా రచయిత. <ref>కథా కిరణాలు - మన తెలుగు కథకులు, [[పైడిమర్రి రామకృష్ణ]], పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[కరీంనగర్‌జిల్లా]] జూపల్లి మండలం, తేలుకుంట గ్రామంలో కాలువ ఓదేలు, పోచమ్మ దంపతులకు [[జనవరి 12]] [[19521953]] న జన్మించాడు. ఆయన సాహితీ ప్రస్థానంలో యిప్పటి వరకు మొత్తం 875 కథలు, 16 నవలలు, 600 వ్యాసాలు, 200 కవితలు వెలుబడ్డాయి. ఆయన విశిష్టమైన "ఆటా" పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందారు. తెలంగాణ ప్రాంతీయ స్పృహతో రాసిన వీరి కథల్లో [[తెలంగాణ]] ప్రాంత స్త్రీల జీవితాల్లోని వివిధ కోణాలు దర్శింపచేసారు.
 
స్త్రీవాద దృక్పథంతో కాలువ మల్లయ్యగారి కథల్ని పరిశీలించినట్లయితే తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని సమస్యల్ని కథా వస్తువులుగా స్వీకరించారు. ఇవి తెలంగాణాలోని మూడు తరాల స్త్రీల జీవితాల్ని ఆకళింపు చేసుకోవడానికి ఉపకరిస్తాయి. భూస్వామ్యవ్యవస్థలో దొరలది తిరుగులేని అధికారం. అయితే దొరల భార్యలైన దొర్సానులది మాత్రం పీడితబ్రతుకే. భర్తలు ఏం చేసినా ప్రశ్నించే హక్కు. స్వాతంత్రంలేక అణిగిమణిగి బతకాల్సి వచ్చింది. ఈ దొర్సానుల బతుకు వెతల్ని కాలువ మల్లయ్యగారు తన కథల్లో చిత్రిస్తూ వచ్చారు. సమస్యలన్నవి అట్టడుగు వర్గాల వారికి మాత్రమే కాదు. అగ్రవర్ణపు స్త్రీలకు కూడా ఉన్నాయని తన కథల్లో నిరూపించారు.
"https://te.wikipedia.org/wiki/కాలువ_మల్లయ్య" నుండి వెలికితీశారు