"వేలూరి శివరామ శాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

రచనల లింకు
(రచనల లింకు)
</poem>
 
==రచనలు <ref>[https://archive.org/search.php?query=creator%3A%22%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF+%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%22 వేలూరి శివరామ శాస్త్రి గారి రచనల జాబితా.]</ref>, శైలి==
==రచనలు, శైలి==
రాశిలో తక్కువైనా వీరికథలు వాసిగలవి . కథావస్తువులో, భాషావిన్యాసంలో, పాత్రచిత్రణములో శాస్త్రిగారి కథలలో అచ్చపు తెలుగుతనము ప్రతిబింబిస్తుంది . విద్వత్కవి కథారచనను చేపట్టితే ఆ సాహిత్య ప్రక్రియ ఎన్ని వన్నెలు - చిన్నెలు దిద్దుకుంటుందో తెలుసుకోవడానికి వేలూరివారి కథానికలు చదివితీరాలి . ఏ రవన అయినా ఒకసారి చదివి అవతల పారవేసేదిగా ఉండకూడదు . ఉత్తమకావ్యము లాగే ఉత్తమ కథానిక పదేపదే చదివిస్తుంది . పదికాలాల పాటు నిలుస్తుంది . [[టాల్ స్టాయ్]], సోమర్ సెట్ మామ్‌ మపాసా, [[ఠాగోర్]], ఓ.[[హెన్రీ]] మొదలైనవారి కథలలో లాగే శివరమశాస్త్రి కథలలో విశ్వజనీనత, ఔచిత్యమూ కుదురుకొంటాయి . అన్నింటినీ మించి రససిద్ధి పరిమళిస్తుంది . అందుకే అవి నిత్యనూతనాలుగా విరాజిల్లుతూ ఉంటాయి . వీరి కథానికలలో పాత్రలు ఆదర్శ పాత్రలు కావు . ముమ్మూర్తులా మానవపాత్రలు . అవి తప్పులూ చేస్తాయి, ఒప్పులూ చేస్తాయి. ఆ పాత్రలు మనము ఎక్కడో చూచినట్టు అనిపిస్తాయి. అంతకంటే రచనకు సాఫల్యము ఏమికావాలి. శివరామ శాస్త్రిగారు గొప్ప పండితులయినప్పటికీ రచనలో భాషాడంబరాన్ని ప్రదర్షించలేదు . సముచిత భాషాప్రయోగపాటవము వీరి సొత్తు . వాచాలత్వం లేదు . అల్పాక్షరముల అనల్పార్ధ రచన వీరి ధ్యేయము . వర్ణనలు అతి వాస్తవికాలు . గ్రాంధిక, వ్యావహారిక భాషలు కమ్మగా కలిసిపోయి కథలు సూటిగా నడుస్తాయి . పిచ్చిపిచ్చి టెక్నిక్కులతో విషయాన్ని అయోమయం చేసి చదువరులను కలవర పెట్టే పద్ధతి వీరి కథలలో ఉండదు .
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2730217" నుండి వెలికితీశారు