నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

చి show change for added title
చి fix bot edits to avoid date validation errors and update title text for bot added title
పంక్తి 32:
 
== బాల్యం ==
1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. [[గుజరాత్ విశ్వవిద్యాలయం]] నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]] నాయకుడిగా పనిచేశారు. [[1970]]లలో [[విశ్వ హిందూ పరిషత్|విశ్వ హిందూ పరిషత్తులో]] చేరారు. [[గుజరాత్‌]]లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన [[జీవితం]] అనేక మలుపులు తిరిగింది<ref>http://www.andhrabhoomi.net/nationalnews.htmlతీసుకున్న తేది 24 డిసెంబర్, 2007 {{Webarchive|url=https://web.archive.org/web/20071028024429/http://www.andhrabhoomi.net/nationalnews.html |date=2007 అక్టోబర్ -10-28 }}</ref>. [[శాసనమండలి]] సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ [[ముఖ్యమంత్రి]]గా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర '''మోదీ''' భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య [[రథయాత్ర]]కు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇన్‌చార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">{{Cite web |url=http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2019 సెప్టెంబర్ -09-11 |archive-url=https://web.archive.org/web/20110901224501/http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm |archive-date=2011 సెప్టెంబర్ -09-01 |url-status=dead }}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్|అక్టోబరు]]<nowiki/>లో నరేంద్ర మోదీని గుజరాత్ [[ముఖ్యమంత్రి]] పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు.
 
=== ముఖ్యమంత్రిగా '''మోదీ''' ===
పంక్తి 43:
'''2002 ఎన్నికలు''': [[2002]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. [[2002]] గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికినీ <ref>{{cite news | title = Don't mention the massacre | work = The Economist | date = [[December 8]], [[2007]] | pages = 47}}</ref> సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి,<ref>{{cite web |url=http://www.indiatoday.com/itoday/20020429/cover.shtml&SET=T |title=Cover story: Narendra Modi - Face of Discord |accessdate=2007-11-16 |format=HTML |work=Swapan Dasgupta }}</ref><ref name="lb">[http://www.indianexpress.com/story/228419.html Riots+economic growth=?] Indian Express - October 15, 2007</ref> మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు.
 
'''2007 ఎన్నికలు''' : [[2007]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు <ref>{{Cite web |url=http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm |title=ఆర్కైవ్ చేసిన కాపీనకలు |access-date=2007 డిసెంబర్ 24 |archive-url=https://web.archive.org/web/20120107080736/http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm |archive-date=2012 జనవరి -01-07 |url-status=dead }}</ref>. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009 లో భారతీయ జనతా పార్టీ తరఫున [[ప్రధానమంత్రి]] అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. [[కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]] రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్‌కే చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విశేషం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అది 4 వ సారి కాగా నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడటం 3 వ పర్యాయం<ref>{{Cite web |url=http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm |title=ఆర్కైవ్ చేసిన కాపీనకలు |access-date=2007 డిసెంబర్ 24 |archive-url=https://web.archive.org/web/20120107092837/http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm |archive-date=2012 జనవరి -01-07 |url-status=dead }}</ref>. గుజరాత్‌లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌ అన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' మాత్రం నరేంద్ర మోదీ అనీ క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది <ref>{{Cite web |url=http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm |title=ఆర్కైవ్ చేసిన కాపీనకలు |access-date=2007 డిసెంబర్ 24 |archive-url=https://web.archive.org/web/20120107075254/http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm |archive-date=2012 జనవరి -01-07 |url-status=dead }}</ref>. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్‌ సీఎం నేనని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని నరేంద్ర మోదీ సరి కొత్త భాష్యం చెప్పారు.
 
'''2012 ఎన్నికలు:''' 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదుచేసింది. నరేంద్రమోదీ స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల మెజారిటితో గెలుపొందినారు. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్రమోదీ దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు