"భరతుడు (కురువంశం)" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==కురు వంశవృక్షం==
చంద్రుడి కొడుకు బుధుడు. బుధుని కుమారుడు పురూరవుడు.పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి ఆరుగురు కుమారులు. వారిలో ఆయుషుడు అనే కుమారునికి కలిగిన నహుషుడు చక్రవర్తి అయ్యాడు. నహుషుని భార్య ప్రియంవద. వారి పుత్రుడు యయాతి.
{{కురు వంశవృక్షం}}
దేవయానీ యయాతికి యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు.శర్మిష్ట వలన దృహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కుమారులు పుట్టారు.
శాపకారణంగా యదు వంశస్తులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు, తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు, ద్రూహ్యులు అతని వంశస్తులు జలమయ ప్రదేశాలకు రాజలయ్యారు, అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు.శర్మిష్ట కుమారుడైన పూరుని చక్రవర్తిని చేసాడు.
పూరుని కుమారుడు జనమేజయుడు, అతని కుమారుడు ప్రాచిన్వంతుడు, అతని కుమారుడు సంయాతి అతని కుమారుడు అహంయాతి అతని కుమారుడు సార్వభౌముడు ఆతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిహుడు అతని కుమారుడు మహాభౌముడు అతని కుమారుడు యుతానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిధి అతని కుమారుడు రుచీకుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు. మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేసాడు. సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది. వారికి త్రసుడు అనేకుమారుడు కలిగాడు. అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు అతని కుమారుడు భరతుడు వంశకర్త అయ్యాడు. భరతునకు భుమన్యుడు జన్మించాడు. భుమన్యుని కుమారుడు సహోత్రుడు అతని కుమారుడు హస్థి. అతని పేరు మీద హస్థినాపురం వెలసింది. హస్తి కుమారుడు వికుంఠనుడు. అతని కుమారుడు అజఘీడుడు. అజఘీడునకు నూట ఇరవై నాలుగు మంది కుమారులు. వారిలో సంవరణుడు అనే వాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురు జన్మించాడు. కురు మరొక వంశకర్త అయ్యాడు.
అతని కుమారుడు అనశ్వుడు. అతని కుమారుడు పరీక్షిత్తు . అతని కుమారుడు భీమశేనుడు. అతని కుమారుడు ప్రదీపుడు. అతని కుమారుడు ప్రతీపుడు. అతని కుమారుడు శంతనుడు. శంతనునికి గంగాదేవి వలన ప్రభాసుని అంశతో
దేవవ్రతుడు జన్మించాడు.పంచభూతముల సాక్షిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసాడు. అలా గాంగేయునికి భీష్ముడనే కారణ నామధేయం కలిగింది. శంతనునికి సత్యవతి వలన చిత్రాంగధుడు,విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు.చిత్రాంగదుని చక్రవర్తిని చేసాడు.అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు.తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేసాడు.కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబిక,అంబాలికలను విచిత్రవీర్యునకిచ్చి వివాహంచేసాడు. విచిత్ర వీర్యుడు భోగ లాలసుడై చివరకు మరణించాడు.
దేవర న్యాయం అనుసరించి అంబికకు వ్యాసుని వలన హంసుడు అనే గంధర్వుడు మహా బలవంతుడైన అంధుడు ఐన ధృతరాష్ట్రుడు జన్మించాడు.రెండవ కోడలయిన అంబాలిక వ్యాసుని తేజస్సుకు భయపడి పాలిపోయినందున ఆమెకు
మరుద్గణాంశతో పాండువర్ణం కల పాండురాజు జన్మించాడు.
అంబికకు గుడ్డి వాడు జన్మించినందువలన దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించినా అందుకు ఆమె మనసు సమ్మతించక తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు విదురునిగా జన్మించాడు.దృతరాష్ట్రునికి గాంధారితో ఆమె పది మంది చెల్లెళ్ళతోనూ మరొక నూరు మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు.
కుంతిభోజుడు కుమార్తె పృధ(కుంతి)స్వయంవరంలో పాండురాజుని వరించింది.
కుంతి వలన యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు,జన్మించారు.ఆతరువాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు.మాద్రివలన అశ్వినీ దేవతల అంశతో నకుల,సహదేవులు జన్మించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2738347" నుండి వెలికితీశారు