నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పట్టణానికి పేరు తెచ్చిన ప్రాంతాలు: మీడియా పైల్ ఎక్కించాను
పంక్తి 57:
 
=== మల్లమ్మ సెంటరు ===
[[దస్త్రం:Narasaraopet Town areal view at Mallamma center.jpg|thumb|250x250px|మల్లమ్మ సెంటరు వద్ద పట్టణం ఏరియల్ వ్యూ]]
నరసరావుపేట పట్టణంలో, చుట్టు ప్రక్కల గ్రామాలలో, ఒకసారి నరసరావుపేట దర్శించిన ఇతర ప్రాంతాలవారెవరికైనా మల్లమ్మ సెంటరు అంటే తెలియనివారు ఉండరు.జమీందారీ పరిపాలనకు అద్దం పట్టిన రాజాగారి కోటకు అతి దగ్గరలో వినుకొండ, సత్తెనపల్లి, పల్నాడు, గుంటూరు వెళ్లే నాలుగు మార్గాలు కలిసే కూడలినే 'మల్లమ్మ సెంటరు' అని అంటారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టణంలో ఇది ప్రధాన కూడలి.వీధులకు,పట్టణాలకు,ఇలాంటి జంక్షన్లకు రాచరికపు కుటుంబాలకు చెందిన వ్యక్తుల, జమీందారీ వంశీయులకు చెందిన వ్యక్తుల, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టడం సాధారణమే. అలాంటి ఏకోవకు చెందని సామాన్య వక్తి పేరుతో ఒక కూడలికి మల్లమ్మ సెంటర్ అనే పేరు చిరస్థాయి గా నిలిచిపోవడం వెనుక ఒక మహిళ ఉందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు.ఈమె కేవలం చిన్న స్వీటు షాపు నడిపిన వ్యాపారి మాత్రమే.ఆమె పేరు చందనం మల్లమ్మ,భర్త కోటయ్య.ఈనాలుగు రోడ్డుల కూడలిలో గుంటూరు,సత్తెనపల్లి వెళ్లు రోడ్డుల కార్నర్ లోని ఒక చిన్న పెంకుటింటిలో 1945 ఫిబ్రవరిలో మిఠాయి దుకాణం ప్రారంభించారు. పట్టణంలో అప్పట్లో మొత్తం ఆరు మిఠాయి దుకాణాలు మాత్రమే ఉండేని.ఈమె దుకాణం నుండే రాజాగారికోటకు అవసరమైన మిఠాలు వెళ్లేవి.జమీందారు తనకు అవసరమైన మిఠాయి ఈ దంపతులు ద్వారా చేయుంచుకునేవారని తెలుస్తుంది.అంతేగాదు వీరు తయారు చేసే మిఠాయి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గుర్రపు బండ్లపై వచ్చి తీసుకు వెళ్లటంతో మల్లమ్మ షాపు ప్రజలకు చాలా దగ్గర అయింది.ఆ తరువాత పెద్ద బజారుగా ఉన్న కూడలికి 1970  ఆ ప్రాంతం నుండి మల్లమ్మ సెంటరుగా పేరు వాడుక పడింది. 85 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఆమె షాపును నిర్వహించింది.వద్దాప్యంతో ఈమె 1990లో మృతి చెందగా, భర్త కోటయ్య 1980లో మృతి చెందాడు.ఇప్పటికీ అదే పేరుతో ఆమె వారసులు అదే సెంటరులో స్వీటు షాపులు నడుపుతున్నారు.  
 
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు