వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 800:
::::[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ, నేను దీన్ని చూళ్ళేదు. ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. [[వాడుకరి:Dollyrajupslp]] గారూ, ఇది ప్రధాన (మొదటి) పేరుబరిలో ఉండాల్సిన వ్యాసం కాదు. ఈ పేరుబరిలో విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు మాత్రమే ఉండాలి. ఇలాంటి వ్యాసాలు "వికీపీడియా" పేరుబరిలో ఉండాలి. మీరు పెట్టిన ఈ [[తెలుగు వికీపీడియా ప్రాజెక్ట్ by IIIT - Hyderabad]] పేజీని తొలగిస్తాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:34, 22 సెప్టెంబరు 2019 (UTC)
::అవును నిజమే గదా! నేను అంత లోతుగా పరిశీలించలేదు.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 08:05, 22 సెప్టెంబరు 2019 (UTC)
తెవికీని బలోపేతం చేయడానికి ప్రయత్నించడం శుభసూచకమే కాని ఆదిలోనే ఇన్నేళ్ళ మన కృషిని దిగజార్చడం నచ్చలేదు. "అరకొరగా ఉన్న తెలుగు వికీపీడియా" అనీ, ఆంగ్ల వికీపీడియాతో పోలిస్తే కేవలం 1% మాత్రమే ఉందనీ చెప్పడం చూస్తే ప్రాజెక్టు పని అనంతరం అద్భుతంగా తెవికీని అభివృద్ధి చేశామనీ చెప్పడం ఖాయమేననిపిస్తుంది. తెవికీలో సుమారు దశాబ్దంన్నర కాలంలో పలువురి స్వచ్ఛందకృషితో 71+ వేల వ్యాసాలు తయారయ్యాయి. ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. ఆంగ్ల వికీపీడియాలో 70 లక్షల వ్యాసాల సంఖ్యకు తెవికీతో పోల్చే అవసరం ఉండరాదు. ప్రపంచవ్యాప్తంగా వాడుకరులు, పాఠకులు ఉన్న ఆంగ్లవికీకి ఆ సంఖ్య అవసరమే కావచ్చు, కాని తెలుగు ప్రాంతానికి. తెలుగు వ్యక్తులను దృష్టిలో ఉంచుకొంటే మనకు 30 లక్షల వ్యాసాల అవసరం ఉంటుందా అనేది ఆలోచించాల్సిన విషయమే ! తెలుగు ప్రాంతానికి, తెలుగు పాఠకులకు అవసరం లేని వ్యాసాలు చెత్త వ్యాసాలుగానే పరిగణిస్తే, చేర్చబోయే వ్యాసాలు అధికంగా అలాంటివే ఉండవచ్చు! ఏదో ఒక దేశానికి సంబంధించి అక్కడి ఊర్లు, అక్కడి వ్యక్తుల వ్యాసాలు ఆంగ్లవికీలో ఉంటే అలాంటి వ్యాసాలు తెవికీకి అవసరం ఉంటుందా? మనం తెవికీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని గ్రామాల, తెలుగు వ్యక్తుల వ్యాసాలు చేర్చాము. ఇతర భాషా వికీలలో అవన్నీ ఉన్నాయా ? పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులకు చెందిన అన్ని గ్రామాల, అక్కడి ఛోటామోటా వ్యక్తుల వ్యాసాలు మనం చేర్చామా ? అలా చేర్చే అవసరం ఉండదు, ఉండరాదు కూడా. ఎందుకంటే మనం వ్రాసేవి పాఠకులకు ప్రయోజనం కలిగించాలి, వారికి అవసరం ఉండాలి. వ్యాసాల సంఖ్య అనేది ముఖ్యం కానేకాదు. ఆంగ్లవికీని అందరు ఉపయోగిస్తారు కాబట్టి అక్కడ అన్ని రకాల, అన్ని ప్రాంతాల వ్యాసాలుంటాయి. దానితో పోటీపడి వ్యాసాల సంఖ్య పెంచుకుంటే తెవికీ అభివృద్ధి చెందుతుందని చెప్పడం సరికాదు. కొన్ని సం.ల క్రితం గూగుల్ అనువాద వ్యాసాలని చెప్పి తెవికీలో గుమ్మరించిన వ్యాసాలనే మనం ఇప్పటికి మనకనుగుణంగా మార్చుకోలేకపోయాం. అసలు చాలా వాటికి ఎలాంటి హిట్లు కూడాలేవు. అప్పట్లో లక్షలు చేతులు మారినట్లు చర్చలలో వ్యక్తమైంది. ఆ వ్యాసాలను చేర్చినవారు మళ్ళీ తెవికీలో ఎలాంటి దిద్దుబాట్లు కూడా చేయలేరు. గతంలో జరిగిన పొరపాట్లను మనం ముందే గ్రహించాలి. చాలా వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని తొలగించి అరకొర గూగుల్ అనువాద సమాచారాన్ని చేర్చడం వల్ల ఆ వ్యాసాలలో ఎంతో కృషిచేసి చేర్చిన సమాచారం అంతా నాశనమైంది. యాంత్రికంగా రోజూ వందలాది వ్యాసాలు చేరుతుంటే వాటిని పరిశీలించడం కూడా ఇప్పుడున్న చురుకైన కొద్దిమంది నిర్వాహకులకు అసాధ్యంగా మారుతుంది. ప్రాజెక్టు సమన్వయకర్తగా ఎవరు వ్యవహరిస్తారు ? వారికి తెలుగు వస్తుందా ? (చర్చకూడా అనువాదం ద్వారా చేసినట్లుగా గమనించవచ్చు). చర్చలలో మన అభిప్రాయాలు వారు అర్థం చేసుకుంటారా? వర్గాలు, మూసలు తదితరాలకు అనువాదం ద్వారా చేర్చడం కష్టమేనని గతంలోనే గ్రహించాము. ఇలాంటివాటికి ఎవరు సరిచేయాలి? కాబట్టి ప్రాజెక్టు పని ప్రారంభించేముందు ఈ విషయాలపై లోతుగా చర్చలు జరగాలి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 08:44, 22 సెప్టెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు