వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 795:
ఈ ప్రాజెక్టులొ పాల్గొనుట కొరకు ఆసక్తి కలిగిన వారు మీ వివరములు, మీ స్పందనలు, మీ సృజనాత్మక ఆలోచనలు, మున్ముందు కృషికి సూచనలు ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో చేర్చమని మనవి. ఈ పేజీ గూగుల్ అనువాదం ఉపయోగించి వ్రాయబడినది. భాష యొక్క సంక్షిప్తతను క్షమించండి.
 
::[[వాడుకరి:Dollyrajupslp]] గారు మీరు ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు తెవికీ సముదాయంతో చర్చలు కొనసాగించండి. తెవికీలో ఏ ప్రాజెక్టు అయిననూ సముదాయం (తెవికీ సభ్యుల) అభిప్రాయాలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుంది. మీరు తెవికీలో చేర్చే వ్యాసాలు ఎలాంటివి ? అనువాదం ఎలా జరుగుతుంది ? తెలుగు ప్రజలను దృష్టిలో ఉంచుకొని వ్యాసాలను అభివృద్ధి చేస్తారా లేక ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలనే అనువాదం చేస్తారా? మీకు వికీలలో పనిచేసిన అనుభవం ఉన్నదా ? తెవికీ నియమాలను తెలుసుకున్నారా ? తెవికీలో ఇదివరకే ఉన్న వ్యాసాలను ఎలా అభివృద్ధి చేస్తారు ? మీరు యాంత్రిక అనువాదం కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది ? మీరు వ్యాసాలలో పరిమాణంకు ప్రాధాన్యత ఇస్తారా లేక నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తారా ? ఈ ప్రాజెక్టు కాలవ్యవధి ఎంత ? మీరు ఈ కాలంలో చేర్చగలిగే వ్యాసాల సంఖ్య (సుమారు) ఎంత ఉండవచ్చు? మీరు చేర్చిన వ్యాసాలలో తర్వాతి కాలంలో తాజాకరణ పరిస్థితి ఏమిటి ? అసలు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశ్యం ఏమిటి ? (అంటే వ్యాసాల సంఖ్యను చేర్చడమాపెంచడమా? తెలుగు భాషను అభివృద్ధి పర్చడమా? తెలుగు వాడుకరులకు సహాయమడటమా? మరేదైనా ?) ఈ ప్రాజెక్టులో ఎందరు భాగస్వాములయ్యే అవకాశం ఉంది? ప్రాజెక్టు సమన్వయకర్తగా ఎవరు వ్యవహరిస్తారు? చేర్చబోయే వ్యాసం తెవికీలో లేదని ఎలా నిర్థారిస్తారు? (అనువాదం ద్వారా కొద్దిపేరుమార్పుతో మళ్ళీ కొత్త వ్యాసం సృష్టిస్తే అది వృధా కాదా?) ఇలాంటి సందేహాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:21, 20 సెప్టెంబరు 2019 (UTC)
::[[వాడుకరి:Dollyrajupslp]] గారూ, మీ కార్యక్రమం గురించి వీలైనంత వివరంగా సముదాయానికి చెప్పండి. వాడుకరులందరం మా అభిప్రాయాలు చెబుతాం. పైన [[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్రకాంతరావు]] గారు సరైన ప్రశ్నలే అడిగారు. ఈ ప్రశ్నలే దాదాపుగా వాడుకరు లందరికీ ఉంటాయి. వీటికి సమాధానాలు దొరికేలా మీ ప్రాజెక్టు గురించి వివరించండి. అయితే మీ ప్రతిపాదన ఇక్కడ కాకుండా, వికీపీడియా పేరుబరిలో రాయండి. అంటే.., [[వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన]] అనే పేరుతోటో లేదా ఇలాంటిదే మరో పేరుతోటో ఒక పేజీ పెట్టి మీ ప్రతిపాదనను అక్కడ రాయండి. వాడుకరులంతా అక్కడే చర్చిస్తారు. (ఈ పేరు బానే ఉందని మీరు భావిస్తే ఈ లింకుపై నొక్కండి, ఓ కొత్త ఖాళీ పేజీ కనిపిస్తుంది. అక్కడ మీ ప్రాజెక్టు గురించి రాయండి.)
::చర్చల్లో - చర్చల్లో మాత్రమే - మీ సందేశం చివరన <nowiki>~~~~</nowiki> అని నాలుగు టిల్డెలు రాస్తే అది మీ సంతకంగా మారుతుంది. సందేశం రాసినది ఎవరో అందరికీ తెలుస్తుందన్నమాట. గమనించగలరు. ___[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 03:32, 22 సెప్టెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు