అలుగుమల్లిపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి గ్రామ విశేషాలు వ్యాసం విస్తరణ,భారతీ తీర్థ మహాస్వామి మీడియా ఫైల్ ఎక్కింపు
పంక్తి 153:
ప్రధాన వ్యాసం:[[భారతీ తీర్థ మహాస్వామి]]
[[దస్త్రం:Jagadguru Bharathi Teertha 2018.jpg|thumb|శృంగేరీ శారదా పీఠం 36 వ పరమాచార్యులు భారతీ తీర్థ మహాస్వామి]]
శృంగేరీ శారదా పీఠం 36 వ పరమాచార్యులు భారతీ తీర్థ మహాస్వామి పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారు.ఇక్కడ [[తంగిరాల]] వారిది వైదికాచార కుటుంబం.తల్లిదండ్రులు తంగిరాల వేంకటేశ్వరావధాని, అనంతలక్ష్మమ్మ.వీరు కృష్ణయజుఃశాఖీయులు, ఆపస్తంబసూత్రులు, కుత్సస గోత్రులు. ఈ దంపతులకు తొలుత ఇద్దరు కుమార్తెలు.మగ సంతానం కోసం నిష్టాపరులై శివపూజ చేశారు.పురుష సంతతి కలిగితెే నీ పేరు పెట్టుకుంటామని శ్రీరామచంద్రుడుకి మొక్కుకున్నారు.శ్రీరామనవమి ఉత్సవాలను తొమ్మిది రోజులు జరిపించారు.ఆ కాలంలో స్వగ్రామంలో కాక వేంకటేశ్వరావధాని, అనంతలక్ష్మమ్మ దంపతులు [[మచిలీపట్నం]]<nowiki/>లో ఉండేవారు.ఆ తరువాత భగవదనుగ్రహం వలన వారి కోరిక ఫలించి, [[శ్రీరామనవమి]] మూడు రోజులుకు వస్తుందనంగా భావనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు అంటే 1951 ఏప్రియల్ 11న మచిలీపట్నంలో అనంతలక్ష్మమ్మ మగశిశువుకు జన్మనిచ్చింది.సీతారాముల అనుగ్రహం వలన కుమారుడు జన్మించాడని స్వామికి ఇచ్చిన మాట ప్రకారం సీతారామాంజనేయులు అని తల్లిదండ్రులు నామకరణం గావించారు.భారతీ తీర్థ మహాస్వామికి ఒక సంవత్సరం వయసు నిండీ నిండగానే తంగిరాలవారి కుటుంబం నరసరావుపేటలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.[[నరసరావుపేట]] పట్టణంలో శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామిచే 1989లో శృంగేరి శంకర మఠం నిర్మించబడింది.<ref>మూలం:నరసరావుపేట ద్విశతాబ్థి ఉత్సవాల ప్రత్యేక సంచిక 30వ పేజీ </ref>
 
==గ్రామంలోని దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/అలుగుమల్లిపాడు" నుండి వెలికితీశారు