"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: వ్యాసం విస్తరణ
చి (→‎top: వ్యాసం విస్తరణ)
==విద్యా సౌకర్యాలు==
 
=== యన్.ఇ.నరసరావుపేట ఇంజనీరింగు కళాశాల ===
[[దస్త్రం:Campus, Narasaraopeta Engineering College.jpg|thumb|250x250px|నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్]]
నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలయన్.ఇ.సి. గాయత్రీ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (జిఇడిఎస్) వ్యవస్థాపకుడు మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావుచే 1998 లో స్థాపించబడింది. కాకినాడలోని జెఎన్‌టియుకు శాశ్వత అనుబంధంతో, గాయత్రి ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (స్వయం ప్రతిపత్తి సంస్థ) ఆధ్వర్యంలో ఈ కళాశాల నడుపబడుతుంది.ఈ సంస్థను న్యూ డిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదం పొందబడి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అండ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుండి ‘ఎ’ గ్రేడ్‌తో గుర్తింపు పొందింది.ఇది గుంటూరు జిల్లాల పల్నాడు ప్రాంతంలో ఏర్పడిన మొదటి సాంకేతిక విద్యా సంస్థ.ఈ కళాశాల ఐయస్ఒ 9001: 2008 తో ధృవీకరించబడింది. గత రెండు దశాబ్దాలలో ఈ ప్రాంతంలోని ఇంజనీర్లు, బ్యూరోక్రాట్లు, నాయకులును ఈ కళాశాల ఉత్పత్తి చేసింది.ఈ కళాశాల ఆవిష్కరణ, పరిశోధన, వ్యవస్థాపకతకు కేంద్రంగా పనిచేస్తుంది. దీనిని విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల బృందం నిర్వహిస్తుంది. కళాశాల మేనేజింగ్ కమిటీ ఛైర్మన్‌గా మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వైస్ ఛైర్మన్‌గా మిట్టపల్లి చక్రవర్తి వ్యవహరిస్తున్నారు.
 
===యస్.యస్ & యన్ కళాశాల===
 
=== శృంగేరి శంకరమఠం ===
స్థానిక ప్రకాశనగర్ వెళ్లు రోడ్డులో పూర్వపు రైలుగేటుకు ముందు ఎడమవైపున ఉంది.దీనిని పట్టణంలో నడయాడిన శృంగేరి పీఠాధిపతి [[భారతీ తీర్థ మహాస్వామి|భారతీతీర్థ మహాస్వామిచే]] నిర్మించబడింది. శంకరమఠం ప్రారంభ ఉత్సవాలు 1989 మే 17 నుండి 21 వరకు ఐదు  రోజులపాటు జరిగాయి.కార్యక్రమాలు ఐదు రోజులపాటు నిర్విరామంగా జరగటానికి పర్వేక్షణకుగాను శృంగేరి,బెంగుళూరు,మద్రాసు,బొంబాయి,హైదరాబాదు పట్టణాల నుండి 500 మంది శృంగేరిపీఠం శిష్యగణం తరలివచ్చి వివిద కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ శారదా శంకరుల మూర్తి ప్రతిష్ఠ,,కుంభాభిషేక మహోత్సవం, హోమగుండం కార్యక్రమాలు సకాలంలో చివరిరోజు 21వ తేధితేది ఆదివారం భారతీతీర్ధ మహాస్వామి చేతులమీదుగా జరిగాయి.<ref>నరసరావుపేట శంకరమఠంలో వైభవోపేతంగా ఉత్సవం,1989 మే 22 ఈనాడు దినపత్రిక 8వ పేజి</ref>ఈ సందర్బంగా భారతీతీర్ధ మహాస్వామి భక్తులను ఉద్దేశించి ప్రియభాషణ చేస్తూ ఆదిశంకరుల కోరికమేరకు శృంగేరిలో వెలసిన శ్రీ శారదాదేవి నరసరావుపేట భక్తజనుల అభీష్ఠం నేరవేరుస్తుందని చెప్పాడు. నరసరావుపేటకు చెందిన లంకా రామనాధం సోదరులు, మిన్నెకల్లుకు చెందిన కేతినేని వీరబ్రహ్మంలు శంకర మఠం నిర్మాణానికి భూదానం చేశారు.<br />
<br />
=== శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయం ===
 
 
=== భారతీ తీర్థ మహాస్వామి ===
[[దస్త్రం:Jagadguru Bharathi Teertha 2018.jpg|thumb|290x290px]]
శృంగేరీ శారదా పీఠం 36వ పరమాచార్యులు భారతీ తీర్థ మహాస్వామి పూర్వీకులు తొలుత [[గుంటూరు జిల్లా]], [[పల్నాడు]] ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న [[అలుగుమల్లిపాడు]] గ్రామానికి చెందినవారు. అలుగు మల్లిపాడు గ్రామంలో [[తంగిరాల]] వారిది వైదికాచార కుటుంబం.తల్లిదండ్రులు వెంకటేశ్వరధాని, అనంతలక్ష్మమ్మ.వీరు కృష్ణయజు:శాఖీయులు,ఆపస్తంబసూత్రులు,కుత్సస గోత్రులు.వీరికి మొదట సంతానంగా ఇద్దరు కుమార్తెలు.పుత్ర సంతానం లేని కారణంగా పుత్రుడు కలగాలని శివారాధన చేశారు.పురుష సంతతి కలిగితే నీ పేరు పెట్టుకుంటామని శ్రీరామ చంద్రుడికి మొక్కుకుని, శ్రీరామ నవమి ఉత్సవాలు తొమ్మిది రోజులుపాటు భక్తి శ్రద్ధలుతో నిర్వహించారు.ఆ కాలంలో వెంకటేశ్వరధాని, అనంతలక్ష్మమ్మ దంపతులు [[మచిలీపట్నం]]<nowiki/>లో ఉండేవారు.వారు కోరుకున్నట్లే భగవదనుగ్రహం వల్ల శ్రీరామ నవమి ఇంకా మూడు రోజులు ఉందనగా భావనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠినాడు అనగా 1951 ఏప్రియల్ 11న మచిలీపట్నంలో అనంతలక్ష్మమ్మకు మగబిడ్డ కలిగాడు.సీతారాముల అనుగ్రహం వలన కుమారుడు జన్మించాడని భావించి ఆ బిడ్దకు సీతారామాంజనేయులు అని నామకరణం గావించారు.భారతీ తీర్థ మహాస్వామికి సంవత్సరం వయసు నిండీ,నిండకముందే నరసరావుపేటలో తంగిరాల కుటుంబం స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.స్వామి చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో  ప్రతాపగిరి శివరామశాస్త్రి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నాడు.ఇతను ఏకసంథాగ్రాహి.1974లో శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిష్ఠించారు.<ref>మూలం:నరసరావుపేట ద్విశతాబ్థి ఉత్సవాల ప్రత్యేక సంచిక 30వ పేజీ </ref>
 
=== చిదానంద భారతీ స్వామి ===
 
==వివిధ రంగాలలో పట్టణానికి చెందిన పేరొందిన వ్యక్తులు==
*[[భారతీ తీర్థ మహాస్వామి]], [[శృంగేరి శారదా పీఠము|(శృంగేరి శారదా పీఠం 36వ పరమాచార్యులు)]]
*[[కొండా వెంకటప్పయ్య|కొండా వెంకటప్పయ్య, (స్వాతంత్ర్య సమరయోధుడు]])
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2746146" నుండి వెలికితీశారు