"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

[[నరసరావుపేట పురపాలక సంఘం|నరసరావుపేట పురపాలకసంఘం]] 1915 మే18న ఆవిర్భవించింది.మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా 1980 ఏప్రిల్ 28న ప్రభుత్వంచే గుర్తించబడింది. పురపాలక సంఘం ప్రస్తుత చైర్ పర్సన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (16 వ వార్డు కౌన్సిలర్) 2014 జులై 1 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన సాగించుచున్నాడు.వైస్ చైర్ పర్సన్ గా షేక్ మీరావలి (4 వ వార్డు కౌన్సిలర్) వ్యవరించుచున్నాడు.పురపాలక సంఘం 34 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-అప్సన్ సభ్యులుతో పరిపాలన కొనపాగుతుంది.
==పట్టణం గత నిర్మాణ చరిత్ర==
నరసరావుపేట పట్టణ నిర్మాణం జరగకముందు ఈ ప్రాంతంలో "'''అట్లూరు"''' అనే చిన్న గ్రామం ఉండేది.ఈ గ్రామానికి కటికనేని నారయ్య,కటికినేని రామయ్య జాగీరుదారులుగా ఉండేవారు. నాటి అట్లూరు గ్రామం ఇప్పటి నరసరావుపేటకు పశ్చిమ భాగాన ఉండేది.అదే ఇప్పడు 'పాతూరు'గా పిలువబడుతుంది.ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు రాజా మల్రాజు వేంకట పెదగుండారాయణిం సా.శ.పూ.1797 పింగళి నామ సంపత్సరం,శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నాడు అతని తండ్రి నరసారావుపేరుతో కోట,పేటల కట్టుబడికి నిర్మాణం చేపట్టి, కోటకు నరసరావుపేట రాజావారి కోట అని, పేటకు నరసారావుపేట అని నామకరణం చేసాడు. అదే నరసరావుపేటగా అవతరించింది.నాటి రాజావారి కోట ఆ తరువాత [[నరసరావుపేట రాజాగారి కోట|రాజావారి కోటగా]] వాడుకలోకి వచ్చింది కోట,పేటల నిర్మాణానికి అట్లూరు జాగీరుదారులైన నారయ్య,రామయ్యలకు అట్లూరుకు బదులుగా [[పెట్లూరివారిపాలెం|పెట్లూరివారిపాలెంను]] జాగీరుగా ఇచ్చి అట్లూరును గుండారాయణిం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.తొలుత అట్లూరుగా మొదలైన ప్రస్థానం, తరువాత నరసరావుపేటగా అవతరించి అంచెలంచెలుగా పట్టణస్థాయికి ఎదిగి, 1915లో నరసరావుపేట పురపాలక సంఘంగా ఆవిర్భవించింది.నరసరావుపేట పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకలు 2015, డిసెంబరు -11,12,13 తేదీలలో జరిగాయి.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/centenary-celebrations-narasaraopet-169100.html |title=వరల్డ్ టాప్10లో అమరావతి: బాబు, బాబూ! జాబు ఎప్పుడు.. వైసిపి ప్లకార్డులు|archiveurl=https://web.archive.org/web/20181209155828/|archivedate=2018-12-09|publisher= వన్ ఇండియా|date=2015-12-11}}</ref><ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=vMw-9tZ2Jdg|title=Narasaraopet Municipality 100 Years Celebrations in Guntur on 11,12,13th Dec|publisher=NTv}}</ref>
 
== రవాణా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2746304" నుండి వెలికితీశారు