"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

 
===యస్.యస్ & యన్ కళాశాల===
శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల,1950లో అప్పటి వెనుకబడిన పలనాడు, తెలంగాణ, [[రాయలసీమ]] ప్రాంతాల విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో నరసారావుపేటలో ఒక చిన్న సంస్థగా తొలుత రైల్వే స్ఠేషన్ ఎదురుగా ఉండే కాటన్ ప్రెస్ లో ప్రారంభించింది.తదుపరి కళాశాల 34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన శాశ్వత భవనంలలోకి మారింది.కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఇలింద్ర రంగనాయకులు.ఈ కళాశాల ప్రిన్సిపాల్ గా రాకపూర్వం గుంటూరు హిందూ కళాశాలలో గణితశాస్ర ఆచార్యుడుగా పనిచేశాడు.జూనియర్ కళాశాల స్థాయి నుండి పూర్తి స్థాయి డిగ్రీ కళాశాలగా ------- నుండి మారింది.మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది. ఇది వివిధ విద్యా రంగాలలో పరిమాణాత్మక విస్తరణ, గుణాత్మక మెరుగుదలల ద్వారా మంచి పురోగతిని సాధించింది.కళాశాల కమిటీ ప్రెసిడెంటుగా కపిలవాయి విజయ కుమార్, సెక్రటరీ, కరస్పాండెంట్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపాల్ గా -------- నుండి వ్యవహరిస్తున్నాడు.ఈ కళాశాలలో వివిధ రంగాలలో పేరొందిన కె.సి రెడ్డి, (చైర్మన్ A.P.S.C.H.E), శేషా శయనా రెడ్డి (హైకోర్టు న్యాయమూర్తి), వి. బాలమోహన్ దాస్ (వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం), కాసు వెంకట కృష్ణారెడ్డి (నరసరావుపేట శాసనసభ మాజీ యం.యల్.ఎ), డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం (దూరదృష్టి, ప్రఖ్యాత విద్యావేత్త, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు,ఎ.యన్.యు) వ్యక్తులు ఈ సంస్థ యొక్క పూర్వ విద్యార్థులు.కళాశాలలో ప్రస్తుతం 'అబోడ్ ఆఫ్ లెర్నింగ్' పి.జి.విద్యా కోర్సులు, యం.బి.ఎ., యం.సి.ఎ.,యం.యస్సీ కెమిస్ట్రీ, సైన్స్ రంగాలలో భోధనలు జరుగుతాయి.ఇటీవలి పరిణామాలు,మార్పుల గురించి తెలుసుకుని కొత్తగా ........ నుండి బయో - టెక్నాలజీని అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రవేశపెట్టబడింది.యన్.సి.సి పూర్వ విద్యార్థుల విభాగం ఉన్నత స్థానాల్లో ఉంది.1955 లో స్థాపించబడిన యన్.యస్.యస్.కళాశాల విభాగం ఆరోగ్యం పరిశుభ్రత, అక్షరాస్యత, మత శ్రేయస్సు, సామరస్యంపై అవగాహన కల్పించడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది.శారీరక విద్య మాజీ, ప్రస్తుత డైరెక్టర్ల మార్గదర్శకత్వంలో కళాశాల రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను పొందింది. కళాశాల లైబ్రరీలో 40,000 పుస్తకాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఉన్నాయి. సంవత్సరానికి దాదాపు 600 మంది విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్న హాస్టల్‌ భవనాలు ఉన్నాయి.విద్య అంటే సమాధానాలు ఇవ్వడం కాదు. తనకు తనలో తాను సమాధానాలు కనుగొనే మార్గంతో విద్యార్థిని సన్నద్ధం చేయడం కోసం, విద్య తమను తాము కనుగొనటానికి కళాశాల విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. వారు ఉన్నత వ్యక్తులుగా ప్రతి విద్యార్థిలో ఉన్న ఆసక్తిని గమనించి డాక్టర్, ఇంజనీర్, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, క్రీడా వ్యక్తి, పర్యావరణవేత్త, కవి, రచయిత లేదా ఆర్థికవేత్త గా ఎదగటానికి కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు వారి కలలకు అనుగుణంగా వనరులను ప్రసారం చేయడంలో వారికి మద్దతు ఇస్తారు.డి.పు.యస్. సొసైటీ యొక్క నినాదం “సెల్ఫ్ బిఫోర్ సెల్ఫ్” కు అనుగుణంగా మాతృభూమికి సేవ చేయడానికి నాగరిక, ఉత్పాదక మానవ మూలధనాన్ని స్థిరంగా ఉత్పత్తి చేయటానికి నిరంతర కృషి ఉంటుంది.
 
=== యస్.కె.ఆర్ & బి.ఆర్.కళాశాల. ===
శ్రీ ప్రసన్నఆంజనేయస్వామివారి దేవాలయం స్థానిక బరంపేటలో1932 సంవత్సరంలో నిర్మించబడింది.
 
=== నరసరావుపేట ఇస్కాన్ ఆలయంటెంపుల్ ===
[[File:ISKCON-NARASARAOPET 01.jpg|thumb|250x250px| ఇస్కాన్ ఆలయం, నరసరావుపేట|alt=]]
(ప్రధాన వ్యాసం:[[నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్]])
== సమీపంలో దర్శించతగిన పుణ్యక్షేత్రాలు ==
 
=== శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం, కోటప్పకొండ ===
[[కోటప్ప కొండ|ప్రధాన వ్యాసం:కోటప్పకొండ]]
[[దస్త్రం:Kotappakonada_Temple_-_2.jpg|thumb|గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం. (కోటప్పకొండ)|alt=|250x250px]]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుపొందిన శైవక్షేత్రాలలో [[కోటప్ప కొండ|కోటప్పకొండ]] ఒకటి.ఇది పట్టణానికి 12 కి.మీదూరంలో ఉంది. ఈ ఆలయం కొండపైన ఉంది.ఇక్కడి స్వామి ఆలయం శ్రీ మేధా దక్షిణామూర్తి అవతార రూపమైన త్రికోటేశ్వరునికి ఆవాసం.ఇంకా భక్తులు స్వామిని కోటయ్య స్వామి భక్తులు కొలుస్తుంటారు. ప్రతి సంవత్సరం [[మహాశివరాత్రి]] పర్వదినాన కోటప్పకొండ తిరునాళ్ల వైభవంగా జరుగుతుంది.పూర్వం నుండి శివరాత్రి రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కొండ పైకి వెళ్లుటకు మెట్ల మార్గమే కానీ వావానాలు వెళ్లటానికి రోడ్డు సౌకర్యం ఉండేదికాదు.వృద్ధులుతో సైతం భక్తులు కష్టపడి మెట్ల మార్గంలో నడకతో వెళ్లవలసి వచ్చేది.మెట్లపై వెళ్లేటప్పుడు ఉత్సాహంతో హరహరా చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా అంటూ త్రికోటేశ్వరుని దర్శనానికి వెళ్లేవారు.గ్రామాలకు విధ్యుత్ సౌకర్యం లేని కాలంలో గ్రామాల నుండి ప్రభలు కట్టుకుని పుష్టి కలిగిన ఎద్దుల జతలతో ప్రత్యేకంగా కలిగిన బండిపై [[ప్రభల సంస్కృతి|ప్రభలను]] ఏర్పాటు చేసుకోని భక్తులు శివనామస్మరణ చేస్తూ ఊరేగింపుగా డప్పు వాయిద్యాలు,డ్యాన్సులతో ఒకరోజు ముందుగా బయలుదేరి శివరాత్రి ఉత్సవానికి వచ్చేవారు.విధ్యుత్ స్తంబాల ప్రభావం వలన క్రమంగా ప్రభలు కట్టుకునే వచ్చే సంప్రదాయం తగ్గుతూ వచ్చింది. జాతీయోద్యమకాలంలో జాతీయ నేతల చిత్రపటాలతో, మతసామరస్యాన్ని, జాతీయ సమైక్యతను ప్రతిబింభించే చిత్రపటాలతో కుల మతాలకు అతీతంగా ప్రభలను అలంకరించుకుని ఉత్సవాన్ని వచ్చేవారు.కొండ పైకి వెళ్ళే దారిలో మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి ఉంది.కొండ మీద గొల్లభామ గుడి ఉంది.పెద్ద శివుని విగ్రహం ఉంది. రాజా మల్రాజు వంశీయులలో ఒకరైన నరసింహరావు దేవస్థానం ధర్మకర్తగా పనిచేసిన కాలంలో 740 మెట్లతో మార్గాన్ని నిర్మించబడింది.మల్రాజు వంశీయుల జమీందార్లు ఆలయానికి భూములు దానంగా ఇచ్చారు.ఇప్పటికీ (2019 నాటికి) ఆలయ ధర్మకర్తలుగా మల్రాజు వంశీయులే కొనసాగుచున్నారు. ఆంద్రప్రదేశ్ తొలి శాసన సభాపతి (విభజనానంతరం) కోడెల శివప్రసాదరావు చేసిన కృషితో రాష్ట్రంలోనే పోరొందిన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా కొటప్పకొండ అభివృద్ది చెందింది.
 
=== శ్రీ కపోతేశ్వరస్వామి ఆలయం, చేజర్ల ===
ఈ ఆలయం సమీప [[నకరికల్లు మండలం|నకిరకల్లు]] మండలానికి చెందిన [[చేజెర్ల (నకిరికల్లు)|చేజర్ల]] గ్రామంలో ఉంది.ఇది నరసరావుపేటకు సుమారు 30 కి.మీ.దూరంలో ఉంది.ఈ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అని అంటారు.ఈ ఆలయానికి ఆ పేరుతో పిలవటానికి మహా భారతం ప్రకారం ఒక కథ ఉంది. మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు ఇద్దరు సోదరులు.మేఘదాంబరుడు శిబిచక్రవర్తి అనుమతితో అతని పరివారంతో తీర్ధయాత్రలకు బయలుదేరతాడు. ఒక కొండపై అతడు  కొందరు యోగులతో కలసి తపస్సు చేస్తూ కాలం చేస్తాడు. కొండపై అతని పార్థీవ శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది.మేఘదాంబరుడు తిరిగి రానందున అన్నను వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వస్తాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి అతనూ మరణించాడు. తమ్ముళ్ళును వెతుక్కుంటూ [[శిబి చక్రవర్తి]] అక్కడికి వచ్చి రెండు లింగాలను చూసి, తన్మయం చెంది అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షీస్తారు. పరీక్షలో భాగంగా శివుడు వేటగానిగా, బ్రహ్మ విల్లు బాణంగా, విష్ణువు కపోతంగానూ ఆ ప్రాంతానికి వస్తారు.వేటగానితో తరమబడిన [[కపోతము|పావురం]] శిబి చక్రవర్తిని రక్షించవలసిందిగా [[శిబి చక్రవర్తి]] అభయమిస్తాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని శిభిచక్రవర్తిని వేడుకుంటాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, [[త్రాసు|త్రాసులో]] పావురాన్ని ఒక వైపు ఉంచి, తన [[శరీరం|శరీరంలో]] కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి చక్రవర్తి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.దీని మీద ఇతరత్రా కథనాలు కూడా ఉన్నాయి
 
== పీఠాధిపతుల నిలయం నరసరావుపేట ==
 
=== భారతీ తీర్థ మహాస్వామి (శృంగేరి పీఠాధిపతి) ===
[[దస్త్రం:Jagadguru Bharathi Teertha 2018.jpg|thumb|290x290px|భారతీ తీర్థ మహాస్వామి.శృంగేరీ పీఠాధిపతి]]
శృంగేరీ శారదా పీఠం 36వ పరమాచార్యులు భారతీ తీర్థ మహాస్వామి పూర్వీకులు తొలుత [[గుంటూరు జిల్లా]], [[పల్నాడు]] ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న [[అలుగుమల్లిపాడు]] గ్రామానికి చెందినవారు. అలుగు మల్లిపాడు గ్రామంలో [[తంగిరాల]] వారిది వైదికాచార కుటుంబం.తల్లిదండ్రులు వెంకటేశ్వరధాని, అనంతలక్ష్మమ్మ.వీరు కృష్ణయజు:శాఖీయులు,ఆపస్తంబసూత్రులు,కుత్సస గోత్రులు.వీరికి మొదట సంతానంగా ఇద్దరు కుమార్తెలు.పుత్ర సంతానం లేని కారణంగా పుత్రుడు కలగాలని శివారాధన చేశారు.పురుష సంతతి కలిగితే నీ పేరు పెట్టుకుంటామని శ్రీరామ చంద్రుడికి మొక్కుకుని, శ్రీరామ నవమి ఉత్సవాలు తొమ్మిది రోజులుపాటు భక్తి శ్రద్ధలుతో నిర్వహించారు.ఆ కాలంలో వెంకటేశ్వరధాని, అనంతలక్ష్మమ్మ దంపతులు [[మచిలీపట్నం]]<nowiki/>లో ఉండేవారు.వారు కోరుకున్నట్లే భగవదనుగ్రహం వల్ల శ్రీరామ నవమి ఇంకా మూడు రోజులు ఉందనగా భావనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠినాడు అనగా 1951 ఏప్రియల్ 11న మచిలీపట్నంలో అనంతలక్ష్మమ్మకు మగబిడ్డ కలిగాడు.సీతారాముల అనుగ్రహం వలన కుమారుడు జన్మించాడని భావించి ఆ బిడ్దకు సీతారామాంజనేయులు అని నామకరణం గావించారు.భారతీ తీర్థ మహాస్వామికి సంవత్సరం వయసు నిండీ,నిండకముందే నరసరావుపేటలో తంగిరాల కుటుంబం స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.స్వామి చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో  ప్రతాపగిరి శివరామశాస్త్రి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నాడు.ఇతను ఏకసంథాగ్రాహి.1974లో శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిష్ఠించారు.<ref>మూలం:నరసరావుపేట ద్విశతాబ్థి ఉత్సవాల ప్రత్యేక సంచిక 30వ పేజీ </ref>
 
=== చిదానంద భారతీ స్వామి (శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి) ===
[[దమ్మాలపాడు]] గ్రామంలో 1913లో జన్మించిన ఇతని అసలుపేరు దమ్మాలపాటి శేషగిరిరావు.గుంటూరు జిల్లా ముప్పాళ్ల[[ముప్పాళ్ళ (జి)మండలం|ముప్పాళ్ల మండలం]],దమ్మాలపాడులో 1913లో జన్మించాడు. తిరుపతి యస్.వి. సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణి - ప్రిలిమనరీ చదివాడు.ఆతరువాత మద్రాసులోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణిగా ఉత్తీర్ణత పొందాడు.నరసరావుపేట మునిసిపల్ ఉన్నత పాఠశాలలో1952 నుండి 1968 వరకు సృస్కృత పండితులుగా పనిచేశారు. తరువాత కొంత కాలంగా పట్టమంలోని శ్రీ రామకృష్ణా ఓరియంటల్ కళాశాలలో సంస్కంత ఉపన్యాసకులుగా పనిచేశాడు.గన్నవరంలోని శృంగేరీ విరూపాక్ష సాంప్రదాయానికి చెందిన భువనేశ్వరీ పీఠం పీఠాధిపతిగా 1986లో పట్టాభిషిక్తుడయ్యాడు.<ref>మూలం:నరసరావుపేట ద్విశతాబ్థి ఉత్సవాల ప్రత్యేక సంచిక 33వ పేజీ </ref>
 
==వివిధ రంగాలలో పట్టణానికి చెందిన పేరొందిన వ్యక్తులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2746531" నుండి వెలికితీశారు