నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం, కోటప్పకొండ: మీడియా ఫైల్ కొత్తకూర్పు ఎక్కింపు
పంక్తి 98:
[[కోటప్ప కొండ|ప్రధాన వ్యాసం:కోటప్పకొండ]]
[[దస్త్రం:Kotappakonada_Temple_-_2.jpg|thumb|గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం.(కోటప్పకొండ)|alt=|250x250px]]
[[దస్త్రం:Kottappakonda Temple - 3.jpg|thumb|268x268px|త్రికోటేశ్వరుని ప్రధాన ఆలయం ముఖద్వారంముఖ ద్వారం]]
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుపొందిన శైవక్షేత్రాలలో [[కోటప్ప కొండ|కోటప్పకొండ]] ఒకటి.ఇది పట్టణానికి 12 కి.మీదూరంలో ఉంది.ఈ ఆలయం కొండపైన ఉంది.ఇక్కడి స్వామి ఆలయం శ్రీ మేధా దక్షిణామూర్తి అవతార రూపమైన త్రికోటేశ్వరునికి ఆవాసం.ఇంకా భక్తులు స్వామిని కోటయ్య స్వామి భక్తులు కొలుస్తుంటారు. ప్రతి సంవత్సరం [[మహాశివరాత్రి]] పర్వదినాన కోటప్పకొండ తిరునాళ్ల వైభవంగా జరుగుతుంది.పూర్వం నుండి శివరాత్రి రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కొండ పైకి వెళ్లుటకు మెట్ల మార్గమే కానీ వావానాలు వెళ్లటానికి రోడ్డు సౌకర్యం ఉండేదికాదు.వృద్ధులుతో సైతం భక్తులు కష్టపడి మెట్ల మార్గంలో నడకతో వెళ్లవలసి వచ్చేది.మెట్లపై వెళ్లేటప్పుడు ఉత్సాహంతో హరహరా చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా అంటూ త్రికోటేశ్వరుని దర్శనానికి వెళ్లేవారు.గ్రామాలకు విధ్యుత్ సౌకర్యం లేని కాలంలో గ్రామాల నుండి ప్రభలు కట్టుకుని పుష్టి కలిగిన ఎద్దుల జతలతో ప్రత్యేకంగా కలిగిన బండిపై [[ప్రభల సంస్కృతి|ప్రభలను]] ఏర్పాటు చేసుకోని భక్తులు శివనామస్మరణ చేస్తూ ఊరేగింపుగా డప్పు వాయిద్యాలు,డ్యాన్సులతో ఒకరోజు ముందుగా బయలుదేరి శివరాత్రి ఉత్సవానికి వచ్చేవారు.విధ్యుత్ స్తంబాల ప్రభావం వలన క్రమంగా ప్రభలు కట్టుకునే వచ్చే సంప్రదాయం తగ్గుతూ వచ్చింది. జాతీయోద్యమకాలంలో జాతీయ నేతల చిత్రపటాలతో, మతసామరస్యాన్ని, జాతీయ సమైక్యతను ప్రతిబింభించే చిత్రపటాలతో కుల మతాలకు అతీతంగా ప్రభలను అలంకరించుకుని ఉత్సవాన్ని వచ్చేవారు.కొండ పైకి వెళ్ళే దారిలో మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి ఉంది.కొండ మీద గొల్లభామ గుడి ఉంది.పెద్ద శివుని విగ్రహం ఉంది. రాజా మల్రాజు వంశీయులలో ఒకరైన నరసింహరావు దేవస్థానం ధర్మకర్తగా పనిచేసిన కాలంలో 740 మెట్లతో మార్గాన్ని నిర్మించబడింది.మల్రాజు వంశీయుల జమీందార్లు ఆలయానికి భూములు దానంగా ఇచ్చారు.ఇప్పటికీ (2019 నాటికి) ఆలయ ధర్మకర్తలుగా మల్రాజు వంశీయులే కొనసాగుచున్నారు. ఆంద్రప్రదేశ్ తొలి శాసన సభాపతి (విభజనానంతరం) కోడెల శివప్రసాదరావు చేసిన కృషితో రాష్ట్రంలోనే పోరొందిన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా కొటప్పకొండ అభివృద్ది చెందింది.
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు