వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 38:
వేణుమాధవ్ 1969, డిసెంబరు 30న [[సూర్యాపేట జిల్లా]] [[కోదాడ]]లో జన్మించాడు.<ref name="ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తాజావార్తలు |title=ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత |url=https://www.andhrajyothy.com/artical?SID=913682 |accessdate=25 September 2019 |work=www.andhrajyothy.com |date=25 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190925082035/https://www.andhrajyothy.com/artical?SID=913682 |archivedate=25 September 2019 |language=te}}</ref> నాన్న [[టెలిఫోన్]] డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా [[కోదాడ]]లోనే సాగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. [[ఇంగ్లీషు]] పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత ఆరో తరగతి కోసం [[జిల్లా పరిషత్]] పాఠశాలలో చేరాడు. నాలుగో తరగతి నుంచే [[మిమిక్రీ]] చెయ్యడం ప్రారంభించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[ఎన్టీఆర్]] పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.
 
ఈయనకు [[వెంట్రిలాక్విజం]] మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో [[బాంబే]] (ప్రస్తుతం [[ముంబై]]) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటి సారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి [[భువనగిరి]]లో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రియైన కీ.శే [[ఎలిమినేటి మాధవ రెడ్డి]] కూడా వేణుమాధవ్ ను [[నల్గొండ]] పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన [[చంద్రబాబు నాయుడు]] చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో [[తెలుగుదేశం పార్టీ]] చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్” అని చెప్పి [[చంద్రబాబు నాయుడు]] వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది.<ref>{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేను మౌలాలి మెగాస్టార్‌ని! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |accessdate=25 September 2019 |work=Sakshi |publisher=డి.జి. భవాని |date=25 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190925083904/https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |archivedate=25 September 2019 |language=te}}</ref>
 
ఆ పరిచయంతో వేణుకు [[హిమాయత్‌నగర్]] లోని [[తెలుగుదేశం పార్టీ]] కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. అందులో పది కాల్స్ వస్తే తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్‌గా ఉండేవి. క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలాకాదని, అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ”బొమ్మగారూ!” అని ఆప్యాయంగా పిలిచేవారు.<ref name="సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూత">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=వార్తలు |title=సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూత |url=https://www.bbc.com/telugu/india-49821762 |accessdate=25 September 2019 |date=25 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190925083408/https://www.bbc.com/telugu/india-49821762 |archivedate=25 September 2019}}</ref>
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు