వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 6:
| caption =
| birthname = వేణుమాధవ్
| birthdate = {{birth date and age|1969|1209|3028}}
| birthplace = [[కోదాడ]], [[సూర్యపేట జిల్లా]], [[తెలంగాణ]]
| deathdate = [[సెప్టెంబరు 25]], [[2019]]
పంక్తి 33:
}}
 
'''వేణుమాధవ్''' ([[డిసెంబరుసెప్టెంబరు 3028]], [[1969]] - [[సెప్టెంబరు 25]], [[2019]]) [[తెలుగు సినిమా]] హాస్యనటుడు. [[మిమిక్రీ]] ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్, 1996లో [[ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కథానాయకుడిగా వచ్చిన [[సంప్రదాయం (సినిమా)|సంప్రదాయం]] సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు.
 
==బాల్యం==
వేణుమాధవ్ 1969, డిసెంబరుసెప్టెంబరు 30న28న [[సూర్యాపేట జిల్లా]] [[కోదాడ]]లో జన్మించాడు.<ref name="ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తాజావార్తలు |title=ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత |url=https://www.andhrajyothy.com/artical?SID=913682 |accessdate=25 September 2019 |work=www.andhrajyothy.com |date=25 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190925082035/https://www.andhrajyothy.com/artical?SID=913682 |archivedate=25 September 2019 |language=te}}</ref> నాన్న [[టెలిఫోన్]] డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా [[కోదాడ]]లోనే సాగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. [[ఇంగ్లీషు]] పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత ఆరో తరగతి కోసం [[జిల్లా పరిషత్]] పాఠశాలలో చేరాడు. నాలుగో తరగతి నుంచే [[మిమిక్రీ]] చెయ్యడం ప్రారంభించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[ఎన్టీఆర్]] పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.
 
ఈయనకు [[వెంట్రిలాక్విజం]] మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో [[బాంబే]] (ప్రస్తుతం [[ముంబై]]) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటి సారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి [[భువనగిరి]]లో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రియైన కీ.శే [[ఎలిమినేటి మాధవ రెడ్డి]] కూడా వేణుమాధవ్ ను [[నల్గొండ]] పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన [[చంద్రబాబు నాయుడు]] చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో [[తెలుగుదేశం పార్టీ]] చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్” అని చెప్పి [[చంద్రబాబు నాయుడు]] వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది.<ref>{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేను మౌలాలి మెగాస్టార్‌ని! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |accessdate=25 September 2019 |work=Sakshi |publisher=డి.జి. భవాని |date=25 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190925083904/https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |archivedate=25 September 2019 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు