కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
}}
 
'''[[కోటప్పకొండ]],''' [[గుంటూరు]] జిల్లా, [[నరసరావుపేట]] దగ్గరమండలం,యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి.ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి<ref name=":0" /> చెందిన మహిమాన్విత క్షేత్రం.ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.
 
==దేవాలయ చరిత్ర==
[[File:కోటప్ప కొండ శిఖరాలు.png|thumb|260x260px|కోటప్పకొండ శిఖరాలు|alt=]]
ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు [[బ్రహ్మ]], [[విష్ణు]], [[రుద్ర]] రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. <ref name=":0"> {{Cite web |title=మహిమాన్విత క్షేత్రం.. కోటప్పకొండ|url=https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4 |archiveurl=https://web.archive.org/web/20190812041154/https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4|archivedate=2019-08-12|publisher= ఈనాడు |date=2018}}</ref> ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన [[శ్రీకృష్ణదేవరాయలు]] దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు మరియు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి [[ఆలయం]] 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు '''శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి''' నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు.
===స్థలపురాణం===
[[File:Kotappa_konda_4.jpg|thumb|త్రికోటేశ్వరస్వామి ఆలయ దృశ్యం|alt=|347x347px]]
పంక్తి 53:
 
==అభివృద్ధి==
యాత్రీకులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్ళడానికి 1999లో [[కోడెల శివప్రసాదరావు]] మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు నిర్మించబడింది.<ref name=":0" /> ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు వున్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి) విగ్రహాలు వుంచారు.
==దేవాలయ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు