వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==సినీ ప్రస్థానం==
అసెంబ్లీలో పని చేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న [[రవీంద్ర భారతి]]కి వెళ్ళడం అలవాటైంది. ఒక సారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళాడు. అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీస్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో 'గుల గుల గులాబ్ జామ్' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చింది. దాన్ని చూసి అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు చూసి సినిమాలలో అవకాశం ఇచ్చారు. వెంటనే మా తదుపరి చిత్రంలో నటిస్తావా అని ఎస్వీ కృష్ణారెడ్డి వేణుమాధవ్ ని అడిగారు. ఆయన మొదటి సినిమా [[ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం అనే సినిమా. ఆ చిత్రానికి వేణు మాధవ్ 70 వేలు పారితోషికం అందుకున్నారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. <ref>మే 17, 2009 ఈనాడు ఆదివారం సంచిక</ref> [[తొలిప్రేమ]] సినిమాలో అమ్మాయిలపైన చాటభారతమంత డైలాగును ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. 2006 లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా [[నంది అవార్డు]]ను అందుకున్నాడు. [[హంగామా (సినిమా)|హంగామా]] సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, [[ప్రేమాభిషేకం (2008 సినిమా)|ప్రేమాభిషేకం]] సినిమాను నిర్మించాడు.<ref name="‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’ |url=https://www.sakshi.com/news/movies/comedian-venu-madhav-interview-170843 |accessdate=25 September 2019 |work=Sakshi |date=25 September 2019 |language=te}}</ref> ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు [[తొలిప్రేమ]], [[సై]], [[ఛత్రపతి]], మొదలైనవి. చివరిసారిగా [[రుద్రమదేవి (సినిమా)|రుద్రమదేవి]], డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ (2016) సినిమాలలో నటించాడు.<ref name="నేను మౌలాలి మెగాస్టార్‌ని!">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేను మౌలాలి మెగాస్టార్‌ని! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |accessdate=25 September 2019 |work=Sakshi |date=25 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190925083904/https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |archivedate=25 September 2019 |language=te}}</ref>
 
ఇండస్ట్రీలో వేణుమాధవ్ కి చిరంజీవి, బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం. చిరు 150వ సినిమా, బాలయ్య 100వ సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నారంటే వారిపై ఎంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. చిరుతో కలిసి వేణుమాధవ్ కొన్ని సినిమాలు చేశాడు. మాములుగా అయితే వేణుమాధవ్ తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ని పాటించడు. పరిశ్రమకొచ్చినప్పట్నుంచీ తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నారు. వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తినిస్తుందని గతంలో వేణుమాధవ్ చెప్పారు. అయితే ఒక్కసారి మాత్రం చిరంజీవి గారి కోసం రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చిందని వేణుమాధవ్ చెప్పారు. చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' సినిమాలో నటిస్తోన్న సమయంలో వేణుమాధవ్ పుట్టినరోజు వచ్చిందట.
 
అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్నా వేణుమాధవ్ తన ఇళ్ళకు ''అచ్చొచ్చిన కృష్ణ నిలయం'' అని పేరు పెట్టుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు