"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎పట్టణం గత నిర్మాణ చరిత్ర: వ్యాసం విస్తరణ)
[[దస్త్రం:Narasaraopet Railway Station.jpg|thumb|250x250px|నరసరావుపేట రైల్వే స్టేషన్|alt=]]
ఈ పట్టణం మొత్తం రోడ్డు పొడవు 157.08 km (97.60 mi). నరసరావుపేట బస్ స్టేషన్ నుండి [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణాసంస్ద]] బస్సులు నడుపుతుంది.ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన పట్టణాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా రవాణా సదుపాయం ఉంది.ఇక్కడకు సమీప విమానాశ్రయం విజయవాడ. నరసరావుపేట రైల్వే స్టేషన్ నల్లపాడు - నంద్యాల విభాగంలో ఉంది. నరసరావుపేట రైల్వే స్టేషనును [[దక్షిణ మధ్య రైల్వే]] జోన్ పరిధిలో ఉంది. దీనిని [[గుంటూరు రైల్వే డివిజను|గుంటూరు రైల్వే డివిజనుచే]] నిర్వహించబడుతుంది.మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణాసంస్ద బస్సుల ద్వారా రవాణా సౌకర్యం ఉంది.
 
== పట్టణంలో పేరొందిన వీధులు ==
 
* ఏనుగుల బజారు:విధ్యుత్ బోర్డు ఆఫీసు నుండి సత్తెనపల్లి రోడ్ వరకు గల వీధిని ఏనుగుల బజారని అంటారు. పెద్దలు ద్వారా పరంపరంగా వస్తున్న సమాచారం ప్రకారం లోగడ రాజా వేంకట గుండారాయునికి 99 ఏనుగుల ఉండేవని,వాటిని కట్టివేసే స్థలానికే ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది. ఈ ఏనుగులలో ఖండేరావు అనే పట్టపు ఏనుగు ఉండేది. సా.శ.పూ.1816 యువ నామ సంవత్సరం ఫాల్గుణ మాసంలో మరాటి దండు దాడి చేసినప్పుడు కోటలోనివారు,పురజనులు కోటలోపల ఉండి తలుపులు వేసుకొని ప్రధాన ద్వారం వద్ద ఖండేరావు పట్టపు ఏనుగును నిలబెట్టగా దాని ఘీంకార, భీకర ధ్వనులకు దుండు భయపడి పారిపోయిందని చెెపుతారు.
* మానికల భావి వీధి: కుసుమ హరనాథ్ మందిర్ నుండి వేంకటేశ్వర టాకీస్ వరకు ఉన్న వీధిని మానికల భావి వీధి అని పిలుస్తారు.మల్రాజులు కూర్చునేందుకు అప్పట్లో ఒక విలాసవంతమైన వేదిక కోటలో ఉండేది.వారు కూర్చొనినప్పడు పైనుండి సన్నని నీటి తుంపరలు పూలవానలాగా కురిసే విధంగా జల యంత్రశాల కోటకు వెలుపల వాయువ్య భాగంలో ఏర్పరచారు.ఈ యంత్రాలకు నీటిని అందించే భావి మేడ వెనుక వీధిలో ఉంది.ఈ భావి ఉన్న బజారను మానికల భావి వీధి అని పేరుపడింది.
* కోటబజారు:మల్రాజుల సంస్థానానికి 100 ఒంటేలు, 500 గుర్రాలు,కార్బలం నాయకులు, దాస,దాసీ జనులుండేవారు.వారి పరివారం అంతా నివశించే గృహాలు ఈ వీధిలో ఉండేవి.అందువలన ఈ బజారుకు కోట బజారు అను పేరు వచ్చింది.ఈ బజారు మానికల భావి నుండి సత్తెనపల్లి రోడ్డు వరకు విస్తరించి ఉంది.
 
==విద్యా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2747518" నుండి వెలికితీశారు