కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వికీపీడియా శైలి ప్రకారం, తటస్థ దృక్కోణంతో వ్యాఖ్యాలు సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
}}
 
'''కోడెల శివప్రసాదరావు''' (1947 [[మే 2]] ౼ 2019 [[సెప్టెంబరు 16]]) ఆంధ్ర ప్రదేశ్‌కుఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి.<ref>http://web.archive.org/web/20190919042020/https://www.andhrajyothy.com/artical?SID=908700</ref> 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
{{POV-section}}
[[గుంటూరు జిల్లా]], [[నకరికల్లు]] మండలం [[కండ్లగుంట]] గ్రామంలో [[1947]] [[మే 2|మే 2న]] కోడెల శివప్రసాదరావు జన్మించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." />అతని తల్లిదండ్రులు సంజీవయ్య,లక్ష్మీనర్సమ్మ.వారిది మధ్యతరగతి కుటుంబం.కోడెల ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం కండ్లకుంటలోనే సాగింది.ఆ తరువాత కొద్దిరోజులు [[సిరిపురం]]లో, చదివిన తరువాత [[నర్సరావుపేట|నర్సరావుపేటలోని]] ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివాడు.[[విజయవాడ]] లయోలా కళాశాల పీయూసీ చదివాడు.అతని చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది.ఆ విషాదమే అతనిని డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది.ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నవారు వైద్యవిద్య చదివించటం ఓ సాహసంలాంటిపని. అతని తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసాడు.కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు.తరువాత [[గుంటూరు]] ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివాడు.
 
== వైద్యవృత్తి ఆరంభం ==
సత్తెనపల్లిలోని రావెల వెంకట్రావు దగ్గర కొంతకాలం అప్రంటీస్ గా వైద్యసేవలు అందించాడు.కొంతకాలం పనిచేసిన తరువాత పల్నాడు ప్రాంత పేద ప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని [[నరసరావుపేట రాజాగారి కోట|రాజాగారికోటలో]] స్వంత హాస్పిటల్ --------- నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు.అతని దగ్గరకు గ్రామీణులే అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు.గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కోడెల శివప్రసాదరావు గ్రామీణులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించాడు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో కోటలోని కోడెల ఆసుపత్రి గడప తొక్కుతారు.అతని హస్తవాసి గొప్పదని ఇప్పటికీ చెప్పుకుంటుంటారని తెలుస్తుంది. పల్నాడులో వైద్యవృత్తిలో ఎదుగుతూ కొందరికి పునర్జన్మ కలిగించాడు.అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా ఉత్తమ ఔషధాలు అందిస్తూ,నమ్మకమైన సేవలందిస్తూ,మంచి సర్జన్‌గా పేరుగడించాడు.
 
== రాజకీయాలలో చేరిక ==
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్ దృష్టి కోడెలపై పడి,1983లో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించాడు.కోడెలకు రాజకీయాలు మీద ఇష్ఠం లేకపోయినప్పటికీ, వైద్యవృత్తి మీద ఉన్న అభిమానాన్ని ప్రక్కనబెట్టి,రాజకీయాలు ద్వారా ప్రజలకు సేవ చేయాలని తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే,మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవాడు.కోడెల భార్య శశికళ గృహిణి. వీరి సంతానం ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యన్నారాయణ. ఒక కుమార్తె. విజయలక్ష్మి.ద్వితీయ కుమార్డు సత్యనారాయణ ఒక ప్రమాదంలోప్రమాదవశాత్తు మరణించాడు.
 
==రాజకీయ జీవితం==
పంక్తి 48:
* నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
* [[కోటప్పకొండ]]ను అభివృద్ది చేయడంలో భాగంగా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయి౦చి, జిల్లాలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేశాడు.ఈ క్షేత్రాన్ని సుందర సౌందర్యంగా అభివృద్ధి చేయడమే కాకుండా, పరమ శివుడే మేధో దక్షిణామూర్తి గా వెలిసిన క్షేత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థితి పొండుతారనే భావంతో, ఈ జ్ఞానప్రదాత సన్నిదిని ఓ సామూహిక అక్షరాభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దుటంతో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.సామూహిక అక్షరాభ్యాస సమయంలో ప్రతి బాలుడికి పెద్దబాలశిక్ష, మేధో దక్షిణామూర్తి రూపులు, కంకణాలు అందించే సంప్రదాయం ప్రవేశపెట్టాడు.
* గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుపొందాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." />అభివృద్ధి ప్రదాతగా నిలిచి, స్పూర్తి ప్రదాతగా పేరు గడించాడు.అభివృద్ధితోనే అంతరాలు తొలుగుతాయని భావించే రాజకీయ నాయకుడు.
* గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని కోడెల జన్మభూమిపై మమకారంతో గ్రామాలకు చెంది, విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” అనే నినాదంతో గ్రామస్తులందరూ కలసి మెలసి ఒక ప్రణాళికను రూపొందించుకుని, ముందు ఊరికి గల లోటుపాట్లను ఒక క్రమ పద్దతిలో రాసుకుని, తర్వాత ఒక్కొక్కటిగా పనులను మొదలు పెట్టడానికి ప్రేమ ఆప్యాయతలతో ఓ ప్రత్యేక ఆత్మీయ సమావేశంను '''"పల్లెకు పోదాం..."''' అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా స్వగ్రామం కండ్లకుంటలో నిర్వహిస్త్తూ,ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని పిలుపునిచ్చాడు.
 
పంక్తి 162:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
* ఈనాడు దినపత్రిక - 20-06-2014
== వెలుపలి లంకెలు ==
<references/>
{{ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు}}
{{Authority control}}