కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
==బాల్యం, విద్యాభ్యాసం==
{{POV-section}}
[[గుంటూరు జిల్లా]], [[నకరికల్లు]] మండలం [[కండ్లగుంట]] గ్రామంలో [[1947]] [[మే 2|మే 2న]] కోడెల శివప్రసాదరావు జన్మించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." /> అతని తల్లిదండ్రులు సంజీవయ్య,లక్ష్మీనర్సమ్మ.వారిది మధ్యతరగతి కుటుంబం. కోడెల ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం కండ్లకుంటలోనే సాగింది.ఆ తరువాత కొద్దిరోజులు [[సిరిపురం (మేడికొండూరు)|సిరిపురం]] లో చదివిన తరువాత, [[నర్సరావుపేట|నర్సరావుపేటలోని]] ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివాడు.[[ విజయవాడ]] లయోలా కళాశాలలో పీయూసీ చదివాడు.అతని చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది.ఆ విషాదమే అతనిని డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నవారు వైద్యవిద్య చదివించటం ఓ సాహసంలాంటిపని. అతని తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసాడు.కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు.తరువాత [[గుంటూరు]] ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు.రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.వారణాసిలో ఎం.ఎస్.చేసాడు
 
== వైద్యవృత్తి ఆరంభం ==