కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
}}
 
'''[[కోటప్పకొండ]],''' [[గుంటూరు]] జిల్లా, నరసరావుపేట మండలం,యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి.ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి<ref name=":0" /> చెందిన మహిమాన్విత క్షేత్రం.ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.
 
==దేవాలయ చరిత్ర==
[[File:కోటప్ప కొండ శిఖరాలు.png|thumb|260x260px|కోటప్పకొండ శిఖరాలు|alt=]]
ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు [[బ్రహ్మ]], [[విష్ణు]], [[రుద్ర]] రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. <ref name=":0"> {{Cite web |title=మహిమాన్విత క్షేత్రం.. కోటప్పకొండ|url=https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4 |archiveurl=https://web.archive.org/web/20190812041154/https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4|archivedate=2019-08-12|publisher= ఈనాడు |date=2018}}</ref> ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన [[శ్రీకృష్ణదేవరాయలు]] దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు మరియు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి [[ఆలయం]] 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు '''శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి''' నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు.
===స్థలపురాణం===
[[File:Kotappa_konda_4.jpg|thumb|త్రికోటేశ్వరస్వామి ఆలయ దృశ్యం|alt=|347x347px]]
పంక్తి 69:
=='''ప్రభల ఉత్సవ సంబరాలు'''==
[[దస్త్రం:Prabha 26.jpg|thumb|శివరాత్రికి కోటప్పకొండ ప్రభలు]]
[[మహాశివరాత్రి]] సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. <ref> {{cite wikisource|title=చిన్ననాటి_ముచ్చట్లు|chapter=మా_ఊరు |author=కె. ఎన్. కేసరి|date=1953}}</ref> ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో మ్రొక్కుబడులున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ వుంటే, అలంకరించిన మువ్వల, గజ్జల, గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది. గ్రామలగుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలను చదువుతారు. <ref> {{cite wikisource|title=తెలుగువారి జానపద కళారూపాలు|chapter=కోటప్పకొండ ప్రభల విన్యాసం|author=మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి}}</ref>
 
ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే , పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు. ఊరేగింపులో బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాల వంటివేషాలవంటి పలు కార్యక్రమాలు ఉంటాయి. గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో [[మేడారం]] తరువాత రెండో అతిపెద్ద జన జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది.
 
=='''వసతి సౌకర్యాలు'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు