కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

→‎రాజకీయం: బ్రిటీష్-->బ్రిటిషు; కాలదోషం పట్టిన వాక్యాల సవరణ
పంక్తి 20:
విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, కాకతీయ కాలంలోనూ ముమ్మరంగా, ఆపైన కొంతమేరకు సైనిక, రాజకీయ, పరిపాలన వృత్తుల్లో పనిచేసినా, కమ్మవారికి శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. ప్రధానంగా కృష్ణా డెల్టా ప్రాంతంలో 20 శాతం జనాభా, 80 శాతం వ్యవసాయ భూమి వీరిదేనని ఒక అంచనా. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో సైనిక హోదాల్లో పనిచేసిన వీరు, దక్షిణాంధ్ర ప్రాంతాల(నేటి తమిళనాడు)ను ఆక్రమించడంలో సాయం చేశారు. యుద్ధంలో పనిచేసి, శాంతి సమయంలో అక్కడే భూములు సాధించుకుని స్థిరపడ్డారు. గణనీయమైన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు అప్పటికే ఉన్న వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చిన భూములను సాగుచేశారు.{{sfn|Benbabaali|2013|p=2}} హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంలు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతులన కోసం, రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలసవచ్చిన కమ్మవారిని నిజాం సాగర్ ప్రాజెక్టు లబ్ది ప్రాంతాల్లో ఉదారంగా భూములు, రెవెన్యూ హోదాలు ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లోనూ విస్తారంగా స్థిరపడి వ్యవసాయం చేశారు.{{sfn|Benbabaali|2013|p=3}} స్వాతంత్రం అనంతరం భారతదేశంలో భూసంస్కరణల ద్వారానూ, రైతాంగ పోరాటాల ద్వారానూ గ్రామాల్లో నివసించని భూస్వాములు, బ్రాహ్మణుల నుంచి గ్రామీణ రైతులైన మరికొందరు కమ్మవారికి దక్కాయి.{{sfn|Purendra Prasad|2015|p=78}}
 
1960ల మధ్యకాలంలో ప్రారంభమైన హరిత విప్లవం వల్ల పారంపర్యంగానూ, భూసంస్కరణలు, రైతాంగ పోరాటం ద్వారా లభించిన భూముల ద్వారానూ విస్తారమైన భూయజమానులుగా, వ్యవసాయదారులుగా ఉన్న కమ్మవారి ఆర్థిక స్థితిని బాగా అభివృద్ధి చేసింది. ఈ భూముల్లో కొన్నిటికి అప్పటికే బ్రిటీష్బ్రిటిషు ప్రభుత్వం, తర్వాతి భారత ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల వ్యవస్థల వల్ల కాలువల ద్వారా నీటి అందుబాటు ఉండడంతో వ్యవసాయదారులైన కమ్మవారికి సంపద మిగులుతో పాటుగా ఆ దశలో రాబడిలో స్థిరత్వమూ పెరిగింది.{{sfn|Purendra Prasad|2015|p=78}} వ్యవసాయ సంస్కరణలు, హరితవిప్లవం కారణంగా పెరిగిన ధరలకు ఇక్కడ భూమిని అమ్మి ఇతర ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి చవకగా దొరికే భూములు కొని సాగుచేశారు.{{sfn|Benbabaali|2013|p=5}} వ్యవసాయ వలసల్లోనూ కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు కృష్ణా డెల్టాలోని కొద్దిభూములను అమ్ముకుని తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, బోరు బావుల ద్వారా సాగు వృద్ధి చేసుకుని మధ్యస్థాయి వ్యవసాయదారులు అయ్యారు. మధ్యస్థాయి, సంపన్న కమ్మ వ్యవసాయదారులు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు, కెసి కెనాల్, తుంగభద్ర, పెన్న నదుల ఆయకట్టుల్లో విస్తారంగా భూములు కొన్నారు.{{sfn|Purendra Prasad|2015|p=79}}
 
కమ్మవారు 20వ శతాబ్ది రెండవ అర్థభాగం నుంచి పలు రంగాల్లో వ్యాపార, ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్నా, పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి తరలిపోయినా కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు. అందుకు భిన్నంగా ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన మిగులును భూములకు మళ్ళించడం కనిపిస్తుంది. పలువురు ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా ఈ భూములను కనీసం కౌలుకు ఇచ్చి భూములపై తమ యాజమాన్యాన్ని కొనసాగిస్తున్నారు.{{sfn|Benbabaali|2013|p=7}}{{sfn|Benbabaali|2013|p=3}}
 
=== వ్యాపారం, పరిశ్రమలు ===
బ్రిటీష్బ్రిటిషు ఇండియా, భారత ప్రభుత్వాలు కాలువల తవ్వకం, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు వంటి వ్యవసాయ సంస్కరణల ద్వారా చేసిన వ్యవసాయాభివృద్ధి నుంచి లాభం పొంది, వలసలతో ఇతర ప్రాంతాల్లోనూ వ్యవసాయ అవకాశాలను అందిపుచ్చుకున్న కమ్మవారు 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు సంపదను వికేంద్రీకరించడంలో ఉపకరించాయి. 1960లు, 70ల్లో జరిగిన హరిత విప్లవం ఈ ప్రయత్నాలకు తోడుకావడంతో పెట్టుబడికి మరింత అవకాశం కలిగి వ్యాపారాలను విస్తరించారు.
 
కమ్మవారిలో జమీందారీ ఉన్న కొద్ది కుటుంబాలు స్వాతంత్రానంతరం తొలి దశాబ్దాల్లోనే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టారు.<ref group=నోట్>ఉదాహరణకు కపిలేశ్వరం - కేశవకుర్రు జమీందారీకి చెందిన ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ కాకినాడ, ఉయ్యూరు ప్రాంతాల్లో, ఉండ్రాజవరం జమీందారీకి చెందిన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తణుకు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో మధ్య, భారీ పరిశ్రమలు స్థాపించారు.</ref> అయితే హరిత విప్లవం ఫలితాలు ఇస్తున్నా కాలంలోనే వ్యవసాయోత్పత్తుల్లో మిగులును వ్యవసాయాధారిత పరిశ్రమల్లో, రవాణా రంగంలో ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. క్రమేపీ ఈ వ్యాపారాలు వృద్ధిచేస్తూ వ్యవసాయం కొనసాగిస్తూనే, కేవలం వ్యవసాయంపైనే ఆధారపడాల్సిన స్థితి లేకుండా చేసుకున్నారు. ఉద్యోగ రంగంతో పాటుగా వ్యాపార రంగంలోని వీరి అభివృద్ధి కమ్మవారిని మరింత పట్టణీకరణ, నగరీకరణ చెందేలా, హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో తాము స్థిరపడే దిశగా తీసుకువెళ్ళింది.{{sfn|Benbabaali|2013|p=5}} భారతదేశంలోని రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమలోనూ కమ్మవారి ప్రభావం విస్తరించింది. అగ్ర కథానాయకులు, దర్శకులు, నిర్మాతల్లో వీరి సంఖ్య ప్రబలంగా ఉండడంతో తెలుగు సినిమా రంగ అభివృద్ధిలో గట్టి పాత్ర పోషించారు. పత్రికా రంగంలోనూ, తర్వాతి దశలో వచ్చిన టీవీ రంగంలోనూ వీరు గణనీయమైన పెట్టుబడులు పెట్టి, పలు తెలుగు పత్రికలు, టీవీ ఛానెళ్ళ అధినేతలుగా కొనసాగుతున్నారు. {{sfn|Benbabaali|2013|p=6}}
పంక్తి 37:
 
== రాజకీయం ==
ప్రస్తుతం పలువురు కమ్మ వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల్లో ప్రముఖ స్థానంలోస్థానాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి, భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు కమ్మ కులానికి చెందినవారు.
 
20వ శతాబ్ది తొలినాళ్ళలో బ్రాహ్మణవ్యతిరేకోద్యమం పేరిట ఉద్యోగాలు, విద్య, అధికారం వంటివాటిలో బ్రాహ్మణేతరులకు జనాభా ప్రాతిపదికన అవకాశం దక్కాలని వాదించిన జస్టిస్‌ పార్టీకి కొందరు కమ్మవారు మద్దతుగా ఉండేవారు. జాతీయవాదులుగా బ్రిటీష్బ్రిటిషు వారు భావించిన బ్రాహ్మణుల ఆధిపత్యం దీని ద్వారా బద్దలుకొట్టవచ్చని భావిస్తూ బ్రిటీష్బ్రిటిషు ప్రభుత్వం ఈ ఉద్యమానికి మద్దతునిచ్చింది. అయితే 1930ల్లో ఆర్థిక మాంద్యం కారణంగా రైతుల మీద పన్నులు బాగా పెరిగాయి. ఈ దశలో వ్యవసాయదారులైన కమ్మవారు అప్పటివరకూ జస్టిస్ పార్టీ విధానమైన బ్రిటీష్‌బ్రిటిషు‌ అనుకూలత విడిచిపెట్టి జాతీయోద్యమంలో పనిచేశారు.{{sfn|Benbabaali|2013|p=4}} 1934లో [[ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ]] ఆవిర్భవించిన నాటి నుంచీ పార్టీ ఉన్నత నాయకత్వం నుంచి శ్రేణుల వరకూ కమ్మవారు ఎక్కువగా ఉంటూ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆర్థికంగా బలపడడానికి అవసరమైన నిధులు కమ్మవారు విస్తారంగా అందించారు.{{sfn|Selig S. Harrison|1956|p=381}} 20వ శతాబ్ది తొలినాళ్ళలో బ్రాహ్మణేతరోద్యమంలో కీలకంగా పనిచేసిన మరో తెలుగు కులం వారైన రెడ్లు క్రమేణా 1930ల నుంచి రెండు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గచూపుతూ 1950ల నాటికి ఆంధ్ర కాంగ్రెస్‌లో నిర్ణయాత్మకంగా ఎదిగారు.{{sfn|Selig S. Harrison|1956|p=384}}<ref group=నోట్>ఈ పరిణామానికి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం నుంచే పార్టీలో పనిచేస్తూ, అగ్ర నాయకుడిగా కొనసాగిన పుచ్చలపల్లి సుందరయ్య, కాంగ్రెస్‌ నాయకుడు ఎన్‌.జి.రంగా ముఖ్యమైన మినహాయింపులుగా ఉన్నారు పుచ్చలపల్లి సుందరయ్య సంపన్న భూస్వామి రెడ్డి కుటుంబంలో జన్మించిన వ్యక్తి, రంగా వ్యవసాయదారులైన కమ్మవారి కుటుంబంలో జన్మించాడు.. సుందరయ్య జన్మనామం పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా తన పేరులోని కులసూచకమైన రెడ్డి విడిచిపెట్టాడు. రంగా కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యుడైనా మంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులు దక్కలేదు. కాంగ్రెస్ వదిలి స్వతంత్ర పార్టీ స్థాపకుల్లో ఒకరిగా వెళ్ళి, దశాబ్ది తర్వాత కాంగ్రెస్‌కు తిరిగివచ్చాడు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పనిచేశాడు.</ref>
 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో, మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర డెల్టాలో, కీలకపాత్ర వహించి, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రభావశీలంగా ఉన్నా కమ్మ కులస్తులకు ఎవరికీ రాజకీయాల్లో ముఖ్యమంత్రిత్వం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తొలి మూడు దశకాలలో (1950, 1960, 1970) కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లభించలేదు.<ref group=నోట్>ఎన్టీరామారావుకు ముఖ్యమంత్రి కాక పూర్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఎక్కువగా రెడ్డి కులస్తులకు దక్కింది. తొమ్మిదిమంది ముఖ్యమంత్రులు అయితే వారిలో ఆరుగురు రెడ్లు, ఒక్కరూ కమ్మవారు లేరు.</ref> 1980 దశకంలో సినీ నటుడు ఎన్‌.టి.రామారావు ఈ పరిణామాన్ని మారుస్తూ తెలుగు దేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాడు.{{sfn|Prakash Sarangi|2004|p=109}}
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు