"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: MassMessage delivery
</div>-- [[user:Kbrown (WMF)|Kbrown (WMF)]] 17:14, 30 సెప్టెంబరు 2019 (UTC)
<!-- Message sent by User:Trizek (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Distribution_list/Global_message_delivery&oldid=19302497 -->
 
== 2020 వికీమీడియా జాతీయ సమావేశం (వికీ కాన్ఫరెన్స్ ఇండియా) హైదరాబాదులో! ==
 
నమస్కారం! భారతదేశంలో ఇప్పటి వరకు రెండు జాతీయ వికీమీడియా సమావేశాలు జరిగాయి, [[m:WikiConference India 2011|మొదటది ముంబైలో]], [[m:WikiConference India 2016|రెండోది చండీగఢ్ లో]]. ఈ విషయం మనలో చాల మందికి తెలిసినదే. 2016 చండీగఢ్ లోని సమావేశం ముగించేప్పుడు ఇలాంటి సమావేశాలు ప్రతి సంవత్సరం జరగాలి అని భావించారు. కానీ గత మూడు సంవత్సరాలుగా అదేమీ జరగలేదు. భారతదేశంలో ఇరవైకి పైగా భాషలలో వికీమీడియా ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రతి భాష వారికీ వాళ్ళ బలాలు-బలహీనతలు ఉన్నాయ్. తమ బలాలను ఇతరా భాషల వారితో పంచుకొంటూ, వారి నుండి నేర్చుకోవటం చాల ముఖ్యం. అది సమర్థవంతంగా జరగాలంటే ఇలాంటి సమావేశాలు చాలా అవసరం. చాల కొద్ది మంది వికీమీడియన్లకు అంతర్జాతీయ సమావేశాలు హాజరు అయ్యే అవకాశం వస్తుంది, వారు అక్కడ చాలానే నేర్చుకుంటారు. వారు నేర్చుకున్న దాని నుంచి, ఇతర నైపుణ్యాలు ఉన్న వికీమీడియన్ల నుండి మనము కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా ఇలాంటి సమావేశాలు చాలానే అవసరం.
 
ఈ విషయంపై [[User:Pavan santhosh.s|పవన్ సంతోష్]], నేను గత కొద్దీ నెలలుగా చర్చించుకుంటున్నాం. ఇటీవలనే, 2020లో భారతదేశం జాతీయ వికీమీడియా సమావేశాన్ని మనము, అనగా తెలుగు వికీమీడియన్లు, ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న మిగతా వికీమీడియన్లు కలిసి దీన్ని హైదరాబాదులో నిర్వహిస్తే బావుంటుందని భావించాం. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే తెలుగు వికీమీడియన్లు, ఆంధ్ర ప్రదేశ్ [[m:VVIT WikiConnect|వి.వి.ఐ.టి వికీ-క్లబ్]] వారు, ఇతర ఏపీ&తెలంగాణ వికీమీడియన్లు కలిసి ఈ సమావేశం నిర్వహిచడానికి మంచి స్థితిలో ఉన్నాం. ఈ పని అసాధ్యం అనుకోవటం సరి కాదు అని మా ఆలోచన, ఎందుకంటే దీనికి మనము హైదరాబాదులో కావాల్సిన ఏర్పాట్లు చేసినా, మిగతా పనులు, అనగా, సమావేశ కార్యక్రమం, స్కాలర్షిప్లు, ఇలాంటి ఆన్లైన్లో చేయగలిగిన పనులకి భారతీయ వికీమీడియన్లు మనకి అన్ని విధాలా తోడు ఉంటారు. ఇది వచ్చే సంవత్సరం డిసెంబర్లో చేయాలనీ అనుకుంటున్నాం, కావున మనకి తగిన సమయం ఉంది. అంతే కాకుండా దీనికి ముఖ్యముగా కావాల్సిన సమయాన్ని కేటాయించడానికి, మాకు ఉన్న నిర్వహణ అనుభవాన్ని వినియోగించడానికి మేం సిద్ధమే. గత సమావేశాలు నిర్వహించిన వారి నుంచి అనుభవాన్నీ మనం తీసుకుందాం.
 
కావున ఈ ఆలోచన కనుక మీకు నచ్చినట్టు అయితే క్రింద దీనికి మద్దతు తెలుపగలరు. అలానే ఏమైనా సందేహాలు, సూచనలు, ఆలోచనలు ఉంటే క్రింది సెక్షన్లో అడగగలరు. ధన్యవాదాలు, [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 10:48, 1 అక్టోబరు 2019 (UTC)
===మద్దతు===
 
#
 
#
 
#
 
#
 
===చర్చ===
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2752698" నుండి వెలికితీశారు