"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

 
===యస్.యస్ & యన్ కళాశాల===
శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల,1950లో అప్పటి వెనుకబడిన పలనాడు, తెలంగాణ, [[రాయలసీమ]] ప్రాంతాల విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో నరసారావుపేటలో ఒక చిన్న సంస్థగా తొలుత రైల్వే స్ఠేషన్ ఎదురుగా ఉండే కాటన్ ప్రెస్ లో ప్రారంభించింది.తదుపరి కళాశాల 34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన శాశ్వత భవనంలలోకి మారింది.కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఇలింద్ర రంగనాయకులు.ఈ కళాశాల ప్రిన్సిపాల్ గా రాకపూర్వం గుంటూరు హిందూ కళాశాలలో గణితశాస్ర ఆచార్యుడుగా పనిచేశాడు.జూనియర్ కళాశాల స్థాయి నుండి పూర్తి స్థాయి డిగ్రీ కళాశాలగా ------- నుండి మారింది.మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది. ఇది వివిధ విద్యా రంగాలలో పరిమాణాత్మక విస్తరణ, గుణాత్మక మెరుగుదలల ద్వారా మంచి పురోగతిని సాధించిందిసాధించిందించిదని అంటారు.ప్రస్తుతం (1919) కళాశాల కమిటీ ప్రెసిడెంటుగా కపిలవాయి విజయ కుమార్, సెక్రటరీ, కరస్పాండెంట్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపాల్ గా --------మల్లయ నుండి వ్యవహరిస్తున్నాడువ్యవహరిస్తున్నారు.ఈ కళాశాలలో వివిధ రంగాలలో పేరొందిన కె.సి రెడ్డి, (చైర్మన్ A.P.S.C.H.E), శేషా శయనా రెడ్డి (హైకోర్టు న్యాయమూర్తి), వి. బాలమోహన్ దాస్ (వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం), కాసు వెంకట కృష్ణారెడ్డి (నరసరావుపేట శాసనసభ మాజీ యం.యల్.ఎ), డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం (దూరదృష్టి, ప్రఖ్యాత విద్యావేత్త, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు,ఎ.యన్.యు) వ్యక్తులు ఈ సంస్థ యొక్క పూర్వ విద్యార్థులు.కళాశాలలో ప్రస్తుతం 'అబోడ్ ఆఫ్ లెర్నింగ్' పి.జి.విద్యా కోర్సులు, యం.బి.ఎ., యం.సి.ఎ., యం.యస్సీ కెమిస్ట్రీ, సైన్స్ రంగాలలో భోధనలు జరుగుతాయిజరుగుచున్నాయి.ఇటీవలిఇటీవల ప్రస్తుత పరిణామాలు,మార్పుల గురించి తెలుసుకుని కొత్తగా ........ నుండి బయో - టెక్నాలజీని అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రవేశపెట్టబడింది.యన్.సి.సి పూర్వ విద్యార్థుల విభాగం ఉన్నత స్థానాల్లో ఉంది.1955 లో స్థాపించబడిన యన్.యస్.యస్.కళాశాల విభాగం ఆరోగ్యం పరిశుభ్రత, అక్షరాస్యత, మత శ్రేయస్సు, సామరస్యంపై అవగాహన కల్పించడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది.శారీరక విద్య మాజీ, ప్రస్తుత డైరెక్టర్ల మార్గదర్శకత్వంలో కళాశాల రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను పొందింది. కళాశాల లైబ్రరీలో 40,000 పుస్తకాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఉన్నాయి. సంవత్సరానికి దాదాపు 600 మంది విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్న హాస్టల్‌ భవనాలు ఉన్నాయి.విద్య అంటే సమాధానాలు ఇవ్వడం కాదు. తనకు తనలో తాను సమాధానాలు కనుగొనే మార్గంతో విద్యార్థిని సన్నద్ధం చేయడం కోసం, విద్య తమను తాము కనుగొనటానికి కళాశాల విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. వారు ఉన్నత వ్యక్తులుగా ప్రతి విద్యార్థిలో ఉన్న ఆసక్తిని గమనించి డాక్టర్, ఇంజనీర్, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, క్రీడా వ్యక్తి, పర్యావరణవేత్త, కవి, రచయిత లేదా ఆర్థికవేత్త గా ఎదగటానికి కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు వారి కలలకు అనుగుణంగా వనరులను ప్రసారం చేయడంలో వారికి మద్దతు ఇస్తారు.డి.పు.యస్. సొసైటీ యొక్క నినాదం “సెల్ఫ్ బిఫోర్ సెల్ఫ్” కు అనుగుణంగా మాతృభూమికి సేవ చేయడానికి నాగరిక, ఉత్పాదక మానవ మూలధనాన్ని స్థిరంగా ఉత్పత్తి చేయటానికి నిరంతర కృషి ఉంటుంది.
 
=== యస్.కె.ఆర్.బి.ఆర్.జూనియర్ కళాశాల. ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2754553" నుండి వెలికితీశారు