హుసేన్ సాగర్: కూర్పుల మధ్య తేడాలు

→‎పడవలు, పోటీలు: దస్త్రాన్ని చేర్చాను
ట్యాగు: 2017 source edit
చి →‎బుద్ధ విగ్రహం: విస్తరించు
పంక్తి 22:
==బుద్ధ విగ్రహం==
[[Image:SUNSET FROM TANKBUND.jpg|right|thumb|200px|ట్యాంక్ బండ్ రోడ్డు మీద నుంచి సూర్యాస్తమయ దృశ్యం.దూరంగా బుద్ధ విగ్రహం కూడాకనిపిస్తుంది]]
[[File:Hyderabad Dec2011 15.JPG|thumb|260px|left|ఎకశిలా బుద్ధ విగ్రహం,[[హుసేన్ సాగర్]], [[హైదరాబాదు]].]]
[[1985]] లో " బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ " ప్రతిపాదించబడింది. గ్రానైట్‌తో చేయబడిన బుద్ధుని శిల్పం చేయడానికి 200 మంది శిల్పులు రెండు సంవత్సరాలు పనిచేసారు. శిల్పం బరువు 440 టన్నులు. శిల్పం ఎత్తు 17 మీ. [[1988]]లో హైదరాబాదుకు తరలించబడిన బుద్ధుని శిల్పం [[1992]]లో హుస్సేన్ సాగర్‌లో స్థాపించబడింది.
<ref name="Buddha of the lake bottom">{{cite news|title=Buddha of the lake bottom|work=Washington Post|accessdate=December 2015|url=https://www.washingtonpost.com/archive/politics/1990/04/09/buddha-of-the-lake-bottom/342902b7-7025-41d3-a856-c14c1fac3815/}}</ref><ref name="Buddha statue consecrated">{{cite news|title=Buddha statue consecrated|work=[[The Hindu]]|accessdate=December 2015|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article3234728.ece}}</ref>
టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది.అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హుస్సేన్‌సాగర్‌ నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారు. శిల్పులు అప్పటి నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి సమీపంలోని వెంకటేశ్వర గుట్టలో అనువైన రాయి ఉందని గుర్తించారు. రాయిని తొలిచే పని 1985లో ప్రారంభమైంది. గుట్ట నుంచి తొలిచిన 17 మీటర్ల పొడవు, 320 టన్నుల భారీ రాయిని బుద్ధుడి విగ్రహంగా మలిచేందుకు 1988లో హైదరాబాద్‌కు 192 చక్రాల భారీ వాహనంపై ఎంతో శ్రమకోర్చి తరలించారు. ప్రముఖ శిల్పి గణపతి సత్పతి ఆధ్వర్యంలో 40 మంది శిల్పులు బుద్ధుడి విగ్రహానికి రూపం ఇచ్చారు. అలా తయారైన భారీ బుద్ధుడిని 1992 డిసెంబరు ఒకటిన హుస్సేన్‌సాగర్‌ నడిబొడ్డున ప్రతిష్ఠించారు. అప్పటినుంచి అదే విగ్రహం హుస్సేన్‌సాగర్‌, నగరం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
 
"https://te.wikipedia.org/wiki/హుసేన్_సాగర్" నుండి వెలికితీశారు