కొండారెడ్డి బురుజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పనిచేయని,వ్యాసానికి సంబంధం లేని లింకులు తొలగించాను
పంక్తి 28:
}}
 
కొండారెడ్డి బురుజు అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి, కానీ మిగతా మూడు బురుజులు శిధిలమైపోయాయి.<ref>{{Cite web|url=http://www.kostalife.com/telugu/%e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%9c%e0%b1%81-%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0/|title=కొండారెడ్డి బురుజు సెంటరు, కర్నూలు, చంద్రగిరికోట @ చిత్తూరు|date=2016-11-24|website=KostaLife|last=Murthy|first=Vydehi|language=en-US|access-date=2019-01-16}}</ref>.శిధిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజు దస్త్రాన్ని ప్రచూరించి, దాని క్రింద "రామానాయుడు బురుజు" అని రాశారు. పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు<ref>{{Cite web|url=http://www.anandbooks.com/Kondareddy-Buruju-Telugu-Book-By-M-Harikishan|title=Kondareddy Buruju - కొండారెడ్డి బురుజు by M.Harikishan -|website=http://www.anandbooks.com/|language=en|access-date=2019-01-16}}</ref>.
 
== చరిత్ర ==
పంక్తి 39:
దీనిని నగరానికి దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథగట్టునుండి రాళ్లతో నిర్మించారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్ళు కనపడితున్నాయి. ఈ కొండారెడ్డి బురుజు మొత్తం నాలుగు భాగాలుగా ఉంది. క్రింది భాగంలో తూర్పువైపు కాపలాదారు ఉండటానికి ఒక చిన్న గది, ఆగ్నేయంవైపు మొదటి అంతస్థుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉన్నాయి. మధ్య భాగంలో నాలుగు స్థంబాలు ఈ బురుజుకు సపోర్టుగా ఉన్నాయి. వీటిని నవాబుల కాలంలో బురుజు పడిపోకుండా నిర్మించినట్లు చెబుతారు. మొదటి అంతస్తులో కుడి,ఎడమలవైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నిట్ట నిలువుగా ఉన్నాయి. అంటే శత్రువులెవరైనా దాడి చేసినపుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డు పడతాయి. ఆ పై భాగంలో సైనికులు ఉండటానికి ఐదు పెద్ద పెద్ద గదులు, ఖైదీలను బంధించడానికి రెండు చిన్న గదులు ఉన్నాయి. అదే విధంగా మధ్యలో అవసరం పడినపుడు తప్పించుకొవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం అలంపూర్ వరకు ఉందని ఇక్కడి ప్రజల అభిప్రాయం<ref>{{Cite web|url=http://www.dharuvu.com/telugu/?q=content/specificity-tower-historic-building-kurnool-kondareddi-0939717|title=క‌ర్నూలు కొండారెడ్డి బురుజు చారిత్ర‌క క‌ట్ట‌డము యొక్క విశిష్ట‌త‌|date=2016-11-09|website=www.dharuvu.com|language=en|access-date=2019-01-16}}</ref>. తుంగభద్రానది క్రింద నుండి సొరంగ మార్గం నిర్మిచడం అప్పట్లో అసాధారణమైనది. కాబట్టి ఈ సొరంగ మార్గం కోట బయట తుంగభద్రానది ఒడ్డువరకు గానీ, ఎస్.పి. కార్యాలయం వరకు గానీ ఉండి ఉండవచ్చని అంచనా. శత్రువులనుండి తప్పించుకొవలసిన సందర్భాలలొ ఈ సొరంగ మార్గం ద్వారా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అలాగే తుంగభద్రానదిని దాటి వెళ్ళిపోవచ్చు. రెండవ అంతస్తు అర్థ వలయాకారంలో చిన్న మార్గంలో ఉంటుంది. ఇందులో పడమరవైపు సైనికుల కోసం నిర్మిచిన ఏడు గదులున్నాయి. వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు గల మనిషి పట్టేంత నిర్మాణాలున్నాయి. ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనబడకుండా తమని తాము రక్షించుకుంటూ, కోటపైకి వచ్చినటువంటి శత్రువులపై దాడి చేయడానికి వీలవుతుంది. ఇక్కడి నుండి తుపాకుల ద్వారా క్రిందివారిని కాల్చవచ్చు. అంతే కాకుండా కొటపైకి ఎగబాకుతున్న వాళ్ళకు పై నుంచి రాళ్ళుగానీ, వేడి వేడి పదార్థాలు కానీ గుమ్మరించడానికి వీలుగా ఉంటుంది. మూడవ అంతస్థులో ఇటుకలతో నిర్మించిన 7 సైనిక గదులు వాటి ముందు విశాలమైన స్థలం ఉన్నాయి. స్థలం మధ్యలో 168 ఎత్తు గల పొడవైన స్తూపం ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగరవేయటం కోసం నిర్మిచినట్లు తెలుస్తుంది. అంతేకాగ దీని పైకెక్కి సుదూరంగా వస్తున్న శత్రువులను కూడా పసిగట్టవచ్చు. ఒకప్పుడు ఈ స్తూపంపైకి ఎక్కడానికి వీలుగా ఒక ఇనుప నిచ్చెన ఉండేది. కానీ ప్రమాదాలు జరగకుండా దానిని తరువాత తొలగించారు. భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగరవేయటం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్తూపాలను ఎన్నిక చేయగా కొండారెడ్డి బురుజు ఐదవ స్థానంపొందింది.
 
విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉంది. తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి (రాజ సోమ శేఖర ఆనందరెడ్డి) నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901 లో [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసినది<ref>{{Cite web|url=https://telugu.nativeplanet.com/travel-guide/konda-reddy-buruju-kurnool-andhra-pradesh-001213.html|title=కర్నూలు 'కొండారెడ్డి బురుజు' కు ఆ పేరెలా వచ్చింది ?|date=2016-10-06|website=https://telugu.nativeplanet.com|last=Staff|language=te|access-date=2019-01-16}}</ref>.
 
==ఇతర విషయాలు==
"https://te.wikipedia.org/wiki/కొండారెడ్డి_బురుజు" నుండి వెలికితీశారు