పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 55:
జాలరి వల వెనుక ఈటెలతో వచ్చే జనం సాధారణ జనం కాదు. వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు. పాలధారంగా పిలిచే ఈ జనధాన అమ్మవారి సైనిక శక్తిగా ప్రతిరూపంగా చెబుతుంటారు. వీరి చరిత్ర కూడా ఘనమైనదే. పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోటరక్షణగా ఉండేవారని కథనం. వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటెలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో పాల్గొంటారు. వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు.
===తెల్ల ఏనుగు===
సిరిమాను జాతరలో తెల్ల ఏనుగు మరో విశిష్టమైన ఆరర్షణఆకర్షణ, గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు. అయితే కాలక్రమేణా సంస్థానాలు, రాజ్యలు పోవడంతో 1956వ సంవత్సరం నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తున్నారు. ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్కచెల్లెళ్లు కాగా పరుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతుంటారు. అపురూప దేవతలందర్నీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపే చేసే ఆ ఏనుగు నిజంగా ఐరావతమే.
===అంజలి రథం===
సిరిమాను సంబరంలో చివరిదైన చిత్రమైన అంశం అంజలి రథం. అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం. ఏలికా, పరిచారికమధ్య, అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది. అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి ధరించిన పరిచారికలు. నాడు తల్లిపై వాళ్లు చూపించిన భక్తి ప్రవక్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీ వేషదారులు సిరిమాను ముందు అంజలి ఘటించి కనిపిస్తారు. తరతరాల సేవా నిరతికి భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం. బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ముందు నడవగా వేషదారులు భక్తి పారవశ్యంతో కదంతొక్కి పరిగెడుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివితీరా చూసి భక్తి భావంతో మమేకమవుతుంటారు. అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి ముక్తమనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేశంలో ఆశీనులై ఊరేగుతారు.