"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

reply to Chandrakanth→‎చర్చ
(reply to Viswanadh)
(reply to Chandrakanth→‎చర్చ)
 
::::అసలు ఈ జాతీయ వికీమీడియా సమావేశం నిర్వహణ యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమిటి? భారతదేశంలో ఇరవైకి పైగా భాషలలో వికీమీడియా ప్రాజెక్టులున్ననూ మిగితావారు ఎందుకు నిర్వహించుట లేదు? ఇప్పటివరకు రెండుసార్లు జరిగి, గత మూడేళ్ళనుంచి నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణాలేంటి? ఈ సమావేశ నిర్వహణకు తెవికీ తరఫున ప్రతిపాదించుటకు బలమైన కారణమేమిటి? ఈ కార్యక్రమం నిర్వహిస్తే తెవికీ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలగుతున్నారు? ఇదివరకు తెవికీ వార్షికోత్సవ సమావేశాలు నిర్వహించిన కొద్దీ తెవికీకి బీటలుపడి బలహీనమైన సంగతి గతానుభవాల ద్వారా నేర్చుకోలేమా? తెవికీ వార్షికోత్సవ సమావేశపు గ్రాంటుపైనే వాదవివాదాలు తలెత్తి కొందరు సీనియర్ సభ్యులు వెళ్ళిపోవడం, ఇప్పటికీ ఖర్చులెక్కలు సమూహానికి చూపకపోవడం, ఆ తర్వాత సమావేశాల నిర్వహణ లేకపోవడం, గత చర్చల ద్వారా అందరికీ అనుభవమైన విషయమే. గ్రాంటులు పొందడం, సమావేశాలు నిర్వహించడం కొందరికి సరదాగా ఉండవచ్చు కాని సమూహపు లక్ష్యాల సంగతి ఏమిటి? గ్రాంటు పొంది చేసిన ఖర్చు వివరాలపై వాదవివాదాలు జరగవని గ్యారంటి ఏమిటి? (ఇదివరకటి చర్చలను పరిశీలించండి). తెవికీలో ఏ ప్రధాన చర్చలో లేనంతగా అధిక సభ్యులు ఈ చర్చలో పాల్గొనడం సంతోషమే. వారిలో అత్యధికులు ఎప్పుడో ఒకప్పుడు ఒకట్రెండు వ్యాసాలలో పనిచేసిన అనుభవం తప్ప తెవికీకి చేసిన సేవలు నామమాత్రమేనని ఎవరైనా గమనించవచ్చు. వీరందరూ అకస్మాత్తుగా చర్చలలోకి ఎలావచ్చారు? వీరిని ప్రేరేపించినది ఎవరు? మరి వీరిని తెవికీ వ్యాసాలలో కృషిచేయమని ప్రేరేపిస్తే / ఉత్సాహపరిస్తే 2020 డిసెంబరు నాటికి తెవికీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం ఖాయంకాదా? సమావేశం నిర్వహణ వల్ల తెవికీకి నష్టం జరగదని ఖచ్చితమైన భరోసా ఈ చర్చా [[User:KCVelaga|ప్రతిపాదకులు]] ఇవ్వగలరా? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:39, 6 అక్టోబరు 2019 (UTC)
:::::{{ping|C.Chandra Kanth Rao}} నమస్కరం! ఈ సమావేశం ఎందుకు జరగాలనే దాని గురించి పైన వివరించం, మరియు [[m:WikiConference_India_2020:_Initial_conversations|ఈ మెటా పేజీలో]] కూడా చూడవచ్చు. ఎందుకు నిర్వహించుట లేదు అనేదానికి ప్రత్యేక కారణం ఏమి లేదు, ఇలాంటి కార్యక్రమం చేయటానికి చాల సమయం కేటాయించాలి, మరియు ఎవరైనా బాధ్యత తీసుకుకోవాలి, కావున పలు కారణాలు అయ్యి ఉండవచ్చు. పైన చెప్పినట్టు గానే ఇది తెవికీ తరపున మాత్రమే కాదు, ఇది ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న వికీమీడియన్ల తరపున; దీనిలో తెలుగు ఒక్కటే కాకుండా, మిగతా ఏ వికీమీడియా ప్రాజెక్టు మరియు భాష వారైనా ఉండవచ్చు. తెవికీ అభివృద్ధి చెందటం ఈ సమావేశం యొక్క ఉద్దేశం కాదు, భారతదేశం మొత్తానా వికీమీడియన్లు కలిసి వివిధ విషయాలు నేర్చుకోవటం మరియు భాషల మధ్యన తోడ్పాటు పెంచటం, దీని ఉద్దేశం. దీన్ని నిర్వహించే పనులలో తెలుగు వారు ఉంటారు కనుక వారు చాలానే విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటది. ఇది వరకు పలు గ్రాంట్లు పొందిన అనుభవం మరియు వికీమీడియా ఫౌండేషన్ వారి [[m:Grants:Project/Committee|ప్రాజెక్టు గ్రాంట్స్ కమిటీలో సభ్యునిగా]] నా అనుభవంతో నేను చెప్పదగినది; ఇది పెద్ద మొత్తం కావున వ్యక్తులు దీనిని నడుపరు, వికీమీడియా ఫౌండేషన్ వారు ఫిస్కల్ శస్పాన్సర్ ద్వారా మనకి అందిస్తారు, దానితో పాటుగా ఒక ఆడిటర్ కూడా ఉంటారు. ఇదే కాకుండా బడ్జెట్ ప్రతిపాదించే ముందు జాతీయ స్థాయిలో వికీమీడియన్లు సంప్రదిస్తాం. అయిపోయిన తరువాత, ఆడిట్ చేసిన పత్రాలు మారాయి అన్ని బిల్స్, రసీదులు ఆన్లైన్లో ఉంచుతాం. అకస్మాత్తుగా వీరందిరిని ప్రేపించారు అనడం చాలా బాధాకరం, పడే పడే మేము చెప్తున్నది ఏమిటంటే ఇది ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉండే వికీమీడియన్లుకు సంబంధం అయింది, ఒక్క తెవికీ కాదు. మీరు చుకున్నట్టు అయితే వారు కొత్త వికీమీడియన్లు కాదు, వికీడేటా, వికీమీడియా కామన్స్, ఆంగ్ల వికీపీడియా మరియు ఇతర ప్రాజెక్టులలో పాల్గొనేవారే. మీరు వారి [[m:Special:CentralAuth|కేంద్ర సవరణలు సమాచారం]] చూడవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలలో తెలుగు అతి కీలకమైన భాగం కనుక ఈ చర్చని ఇక్కడ మొదలు పెట్టాం, అసలు అయితే మెటాలో జరగాల్సింది. తెలుగు వచ్చి ఏ వికీమీడియా ప్రాజెక్టులో రచనలు చేసేవారైనా పాల్గొన వచ్చు - ఆలా కాదు అనటం సమంజసం కాదు అని నా భావన, ఎందుకంటే ఇది ఒక తెవికీ సంబంధ పాలిసీ లేదా అడ్మిన్ చర్చ కాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల వికీమీడియన్లు నిర్వహించే దాని గురించి చర్చ. ఇంకో కారణం ఇది ఇక్కడే చేయటానికి, మనకి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా యూసర్ గ్రూప్ లాంటిది లేకపోవటం బాధాకరం. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 06:01, 9 అక్టోబరు 2019 (UTC)
 
== GLOW edit-a-thon starts on 10 October 2019 ==
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2756268" నుండి వెలికితీశారు