నెల్లూరు, కడప, చెంగల్ పట్టు ప్రాంతములకు తమ్ముసిద్దితమ్ముసిధ్ధి రాజు. ఇతడు మనుమసిద్దిమనుమసిధ్ధి మూడవ కొడుకు. తన అన్నలు తిక్క, నల్లసిద్ధి లను నిర్వీర్యులను చేసి పాలించుతుండగా తిక్కభూపాలుడు తమ్ముసిద్ధిని గద్దె దించుటకు గణపతిదేవుని ఆశ్రయించుతాడు. గణపతి నెల్లూరు రాజ్యమును జయించి తిక్కభూపాలునకు అప్పగించి వెడలుతాడు. [[జాయప సేనాని|జాయప నాయుడు]] 1213లో వేయించిన [[చేబ్రోలు]] శాసనములో ఈ వివరాలున్నాయి. తదుపరి జరిగిన గణపతిదేవుని యుద్ధములలో తిక్క పలుమార్లు చేయందిస్తాడు. [[కంచి]] చోళులను, [[కడప]] వద్ద సేవణులను, కళింగులను ఓడించుటలో తిక్క హస్తమున్నది<ref>Kakati Ganapatideva and His Times by P. Sivunnaidu, 2004, Kalpaz Publication, New Delhi</ref>.