వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 571:
::::అసలు ఈ జాతీయ వికీమీడియా సమావేశం నిర్వహణ యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమిటి? భారతదేశంలో ఇరవైకి పైగా భాషలలో వికీమీడియా ప్రాజెక్టులున్ననూ మిగితావారు ఎందుకు నిర్వహించుట లేదు? ఇప్పటివరకు రెండుసార్లు జరిగి, గత మూడేళ్ళనుంచి నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణాలేంటి? ఈ సమావేశ నిర్వహణకు తెవికీ తరఫున ప్రతిపాదించుటకు బలమైన కారణమేమిటి? ఈ కార్యక్రమం నిర్వహిస్తే తెవికీ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలగుతున్నారు? ఇదివరకు తెవికీ వార్షికోత్సవ సమావేశాలు నిర్వహించిన కొద్దీ తెవికీకి బీటలుపడి బలహీనమైన సంగతి గతానుభవాల ద్వారా నేర్చుకోలేమా? తెవికీ వార్షికోత్సవ సమావేశపు గ్రాంటుపైనే వాదవివాదాలు తలెత్తి కొందరు సీనియర్ సభ్యులు వెళ్ళిపోవడం, ఇప్పటికీ ఖర్చులెక్కలు సమూహానికి చూపకపోవడం, ఆ తర్వాత సమావేశాల నిర్వహణ లేకపోవడం, గత చర్చల ద్వారా అందరికీ అనుభవమైన విషయమే. గ్రాంటులు పొందడం, సమావేశాలు నిర్వహించడం కొందరికి సరదాగా ఉండవచ్చు కాని సమూహపు లక్ష్యాల సంగతి ఏమిటి? గ్రాంటు పొంది చేసిన ఖర్చు వివరాలపై వాదవివాదాలు జరగవని గ్యారంటి ఏమిటి? (ఇదివరకటి చర్చలను పరిశీలించండి). తెవికీలో ఏ ప్రధాన చర్చలో లేనంతగా అధిక సభ్యులు ఈ చర్చలో పాల్గొనడం సంతోషమే. వారిలో అత్యధికులు ఎప్పుడో ఒకప్పుడు ఒకట్రెండు వ్యాసాలలో పనిచేసిన అనుభవం తప్ప తెవికీకి చేసిన సేవలు నామమాత్రమేనని ఎవరైనా గమనించవచ్చు. వీరందరూ అకస్మాత్తుగా చర్చలలోకి ఎలావచ్చారు? వీరిని ప్రేరేపించినది ఎవరు? మరి వీరిని తెవికీ వ్యాసాలలో కృషిచేయమని ప్రేరేపిస్తే / ఉత్సాహపరిస్తే 2020 డిసెంబరు నాటికి తెవికీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం ఖాయంకాదా? సమావేశం నిర్వహణ వల్ల తెవికీకి నష్టం జరగదని ఖచ్చితమైన భరోసా ఈ చర్చా [[User:KCVelaga|ప్రతిపాదకులు]] ఇవ్వగలరా? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:39, 6 అక్టోబరు 2019 (UTC)
:::::{{ping|C.Chandra Kanth Rao}} నమస్కారం! ఈ సమావేశం ఎందుకు జరగాలనే దాని గురించి పైన వివరించాం, మరియు [[m:WikiConference_India_2020:_Initial_conversations|ఈ మెటా పేజీలో]] కూడా చూడవచ్చు. ఎందుకు నిర్వహించుట లేదు అనేదానికి ప్రత్యేక కారణం ఏమి లేదు. ఇప్పుడు కారణాల కోసం ఊహించవలసి వస్తుంది- ఇలాంటి కార్యక్రమం చేయటానికి చాల సమయం కేటాయించాలి, మరియు ఎవరైనా బాధ్యత తీసుకుకోవాలి, కావున పలు కారణాలు అయ్యి ఉండవచ్చు. పైన చెప్పినట్టు గానే ఇది తెవికీ తరపున మాత్రమే కాదు, ఇది ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న వికీమీడియన్ల తరపున; దీనిలో తెలుగు ఒక్కటే కాకుండా, మిగతా ఏ వికీమీడియా ప్రాజెక్టు మరియు భాష వారైనా ఉండవచ్చు. తెవికీ అభివృద్ధి చెందటం ఒక్కటే ఈ సమావేశం యొక్క ఉద్దేశం కాదు, భారతదేశం మొత్తంలో వికీమీడియన్లు కలిసి వివిధ విషయాలు నేర్చుకోవటం మరియు భాషల మధ్యన తోడ్పాటు పెంచటం, దీని ఉద్దేశం. దానిలో తెవికీ అభివృద్ధి కూడా కలిసేఉంటుంది ఇతర భాషలు సహా. దీన్ని నిర్వహించే పనులలో తెలుగు వారు ఉంటారు కనుక వారు చాలానే విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాతి అంశం: ఇది వరకు పలు గ్రాంట్లు పొందిన అనుభవం మరియు వికీమీడియా ఫౌండేషన్ వారి [[m:Grants:Project/Committee|ప్రాజెక్టు గ్రాంట్స్ కమిటీలో సభ్యునిగా]] నా అనుభవంతో నేను చెప్పదగినది ఏమంటే ఇది పెద్ద మొత్తం కావున వ్యక్తులు దీనిని నడుపరు, వికీమీడియా ఫౌండేషన్ వారు ఫిస్కల్ స్పాన్సర్ (ఒక సంస్థను అందుకు ఎంచుకుంటారు) ద్వారా మనకి అందిస్తారు, దానితో పాటుగా ఒక ఆడిటర్, అక్కౌంటెంట్ కూడా ఉంటారు. ఖర్చు కూడా ఒకరి ఇష్టానుసారం జరగదు. ఇదే కాకుండా బడ్జెట్ ప్రతిపాదించే ముందు జాతీయ స్థాయిలో వికీమీడియన్లు సంప్రదిస్తాం. అయిపోయిన తరువాత, ఆడిట్ చేసిన పత్రాలు మరియు అన్ని బిల్స్, రసీదులు ఆన్లైన్లో ఎవరైనా చూసేలా ఉంచుతాం. ఇది అలా ఉంచితే, అకస్మాత్తుగా వీరందిరిని ప్రేరేపించారు, రాయించారు అనడం చాలా బాధాకరం. పదే పదే మేము చెప్తున్నది ఏమిటంటే ఇది ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉండే వికీమీడియన్లుకు సంబంధించింది, ఒక్క తెవికీ మాత్రమే కాదు. మీరు కాస్త జాగ్రత్తగా గమనించి ఉంటే వారు కొత్త వికీమీడియన్లు కాదు, వికీడేటా, వికీమీడియా కామన్స్, ఆంగ్ల వికీపీడియా మరియు ఇతర ప్రాజెక్టులలో పాల్గొనేవారే. మీరు వారి [[m:Special:CentralAuth|కేంద్ర సవరణలు సమాచారం]] చూడవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలలో తెలుగు అతి కీలకమైన భాగం కనుక ఈ చర్చని ఇక్కడ మొదలు పెట్టాం. అసలు అయితే మెటా-వికీలో జరగాల్సింది. తెలుగు వచ్చి ఏ వికీమీడియా ప్రాజెక్టులో రచనలు చేసేవారైనా ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన వచ్చు. అలా కాదు అనటం సమంజసం కాదు అని నా భావన. ఎందుకంటే ఇది ఒక తెవికీ సంబంధ పాలిసీ లేదా అడ్మిన్ చర్చ కాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల వికీమీడియన్లు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్న దాని గురించి చర్చ. మనకి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా యూసర్ గ్రూప్ లాంటిది లేకపోవటం బాధాకరం. ఈ చర్చ ఇక్కడే చేయడానికి అది ఒక కారణం. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 06:35, 9 అక్టోబరు 2019 (UTC)
::::::{{ping|C.Chandra Kanth Rao}} నమస్కారం! మీరు తెవికీ లో పనిచేస్తున్నారు. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలో ఇతర భాషా వికీపీడియన్లు లేరు అని అనుకోవడం సరికాదు. మీకు తెలియని వికీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలో చాలా ఉంది. వికీపీడియాలో ఇతరభాషలతో పాటు, కామన్స్, వికీడేటా వంటి ఇతర వికీప్రోజెక్టుల మీద చాలామంది పనిచేస్తున్నాం. మీరు దానిని గమనిస్తే బావుంటుంది. మరొక ముఖ్య విషయము ఏమిటంటే, మేము మా కాలేజీ లో మా సొంత ఆసక్తితో కాలేజీ యాజమాన్యం తో మాట్లాడి వికీ-క్లబ్ స్థాపించి, వికీపీడియా మరియు ఇతర వికీ ప్రాజెక్టులను మా కాలేజీ లో ఉత్సాహవంతులు అయినా కొందరు విద్యార్థులకు ఇప్పటికే పరిచయం చేస్తున్నాం. మేము ముఖ్యంగా వికీడేటా, ఇంగ్లీష్ వికీపీడియా లో పాల్గొంటున్నం. మీకు బహుశా [[m:Special:CentralAuth|కేంద్ర సవరణలు సమాచారం]] మరియు గ్లోబల్ కంట్రిబ్యూషన్స్ చూడడం రాకపోతే అడిగి తెలుసుకోండి. అంతేకాని మీరు ఇలా తోటి వికీపీడియన్లను మరియాద లేకుండా కించ పరిచే విధంగా మాట్లాడడం సరికాదు. మీరు వికీపీడియా యొక్క [[వికీపీడియా:ఐదు_మూలస్తంభాలు|ఐదు మూల స్తంభాలలో]] నాల్గవ దాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు కొన్నాళ్ళు దూరంగా ఉండడం వల్ల, వికీడేటాలో పనిచెయ్యకపోవడం వల్ల, కొన్నాళ్ళు చర్చల్లోనే రాయడం వల్ల మీరు వికీపీడియన్ కాదంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు మా గురించి అన్నది అంతే పొరబాటు. వికీపీడియాలో ఎవరైనా స్వచ్చందంగా పనిచేయొచ్చు. మేము కాలేజీ విద్యార్థులం. మాకు ఉన్న ఇతర పనుల వలన, మా సామర్థ్యం ఎలా ఉందన్న దాని వలన వికీమీడియా ప్రపంచంలో స్వచ్చందంగా తెలుగో, ఇంగ్లీషో, వికీపీడియానో, వికీడేటానో ఏవో కొన్ని ప్రాజెక్టుల మీద పనిచేస్తాం. సమావేశం ముఖ్యఉద్దేశం కృష్ణ చైతన్య వివరంగా రాశారు. మీరు దయచేసి సంభాషణని పూర్తిగా అర్థం చేసుకొని చర్చలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీరు అర్ధం చేసుకున్నా కొంత సమాచారంతో ఏదంటే అది మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు. [[వాడుకరి:Nivas10798|Nivas10798]] ([[వాడుకరి చర్చ:Nivas10798|చర్చ]]) 09:59, 9 అక్టోబరు 2019 (UTC)
::::@ [[User:KCVelaga|KCVelaga]], నా సందేహాలకు అసలు కారణం మీరు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు కాని మీ సమాధానం మాత్రం ఆ దిశగా సాగలేదు. నేను ఏదేదో అనుమానాలు పడుతున్నట్లుగా, ఊహాగానాలతో మీరు రాశారని తెలుస్తోంది. ఇదివరకటి అనుభవాలతో ఇలాంటి సమావేశాలు తెవికీకి నష్టం కలిగించాయని నేను వివరణలతో తెల్పితే (గతానుభవాలకు అనుమానాలకు తేడా ఉంటుందని గమనించండి) సమాధానాన్ని మాత్రం ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళారు. అవన్నీ నేను అడగలేను (అవి నాకు తెలుసు కూడా). నా చర్చా ఉద్దేశ్యం మరియు చివరగా స్పష్టంగా చెప్పింది ఒక్కటే. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో దానికి సమాధానం ఇవ్వగలిగితే ఇవ్వండి చాలు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:15, 9 అక్టోబరు 2019 (UTC)
 
== GLOW edit-a-thon starts on 10 October 2019 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు