శనగపిండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
===ఆగ్నేయ, తూర్పు ఆసియా===
* బర్మీస్ టోఫు(బర్మాలో తయారయే ఒక రకం పన్నీర్)
* జిడో లియాంగ్ఫెన్([[చైనా]], [[టిబెట్]] వంటి దేశాల్లో శనగపిండిని వాడి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. అక్కడ ఈ వంట ఎక్కువగా దొరికే చిరుతిండి. అక్కడి ప్రజలు ఎక్కువగా వేసవికాలంలో ఈ వంటకాన్ని తినడానికి ఇష్టపడతారు.)
 
===దక్షిణ యూరప్===
లిగురియా సముద్ర తీరప్రాంతాల్లో కూడా శనగపిండి వాడకం బాగానే ఉంది. అయితే నేరుగా శనగలు కాకుండా, అదే జాతికి చెందిన గర్బెంజో పప్పును వాడి శనగపిండిని తయారు చేస్తారు. ఈ పిండితో ఒవెన్ లో తయారు చేసే పల్చటి పాన్ కేక్(దోశ వంటిది)ను తయారు చేస్తారు. ఈ పాన్ కేక్ ను ఇటాలియన్ భాషలో ఫరినటా అనీ, గెనోవా భాషలో ఫైనా అనీ, ఫ్రెంచ్ లో సొక్కా లేదా కేడ్ అని పిలుస్తారు. కాస్త తయారీ విధానం తేడా తప్పించి, ఈ దేశాలన్నింటిలోనూ ఈ పాన్ కేక్ ను చిరుతిండిగా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సిసిలియాలో శనగపిండిని ఉపయోగించి పెనెల్లే అనే ఒక రకం బజ్జీలను తయారు చేస్తారు. స్పెయిన్ వారు చేసుకునే టొర్టిల్లటిస్ డీ కేమరోన్స్ అనే వంటకంలో శనగపిండి ప్రధాన దినుసు.
సైప్రస్, [[గ్రీస్]] వంటి దేశాల్లో చర్చిల్లో జరిగే సంస్మరణ సభల్లో, ప్రత్యేకించి కోలివా అనే ఒక వంటకాన్ని వడ్డిస్తారు. దీనిని పవిత్రమైన వంటకంగా భావించి, చనిపోయినవారి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉడకపెట్టిన గోధుమలతో చేసే ఈ వంటకంలో శనగపిండిని అలంకారానికి వాడతారు. ఈ వంటకంలో శనగపిండి ప్రధాన దినుసు కాకపోయినా, తప్పకుండా పై నుంచి చల్లడానికి ఉపయోగిస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శనగపిండి" నుండి వెలికితీశారు