"శనగపిండి" కూర్పుల మధ్య తేడాలు

లిగురియా సముద్ర తీరప్రాంతాల్లో కూడా శనగపిండి వాడకం బాగానే ఉంది. అయితే నేరుగా శనగలు కాకుండా, అదే జాతికి చెందిన గర్బెంజో పప్పును వాడి శనగపిండిని తయారు చేస్తారు. ఈ పిండితో ఒవెన్ లో తయారు చేసే పల్చటి పాన్ కేక్(దోశ వంటిది)ను తయారు చేస్తారు. ఈ పాన్ కేక్ ను ఇటాలియన్ భాషలో ఫరినటా అనీ, గెనోవా భాషలో ఫైనా అనీ, ఫ్రెంచ్ లో సొక్కా లేదా కేడ్ అని పిలుస్తారు. కాస్త తయారీ విధానం తేడా తప్పించి, ఈ దేశాలన్నింటిలోనూ ఈ పాన్ కేక్ ను చిరుతిండిగా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సిసిలియాలో శనగపిండిని ఉపయోగించి పెనెల్లే అనే ఒక రకం బజ్జీలను తయారు చేస్తారు. స్పెయిన్ వారు చేసుకునే టొర్టిల్లటిస్ డీ కేమరోన్స్ అనే వంటకంలో శనగపిండి ప్రధాన దినుసు.
సైప్రస్, [[గ్రీస్]] వంటి దేశాల్లో చర్చిల్లో జరిగే సంస్మరణ సభల్లో, ప్రత్యేకించి కోలివా అనే ఒక వంటకాన్ని వడ్డిస్తారు. దీనిని పవిత్రమైన వంటకంగా భావించి, చనిపోయినవారి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉడకపెట్టిన గోధుమలతో చేసే ఈ వంటకంలో శనగపిండిని అలంకారానికి వాడతారు. ఈ వంటకంలో శనగపిండి ప్రధాన దినుసు కాకపోయినా, తప్పకుండా పై నుంచి చల్లడానికి ఉపయోగిస్తారు.
 
===ఉత్తర ఆఫ్రికా===
[[మొరాకో]]లో కరన్ అనే వంటకాన్ని ఎక్కువగా చేస్తుంటారు. శనగపిండి, గుడ్లు వాడి, ఒవెన్ లో చేసే ఈ వంటను, అక్కడి వారు ఇష్టంగా తింటారు. ఇలాంటి వంటకమే అల్జీరియాలో కూడా చేస్తుంటారు. వారి భాషలో ఈ వంటని గరన్టిటా లేదా కరన్టిటా అంటారు.<ref>{{cite web|title=Karantita, Garantita, La Petite Panière |url=https://lapetitepaniere.com/2014/04/29/karantita-garantita |access-date=July 18, 2016}}</ref>
 
== మూలాలు ==
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2760929" నుండి వెలికితీశారు