"జీ తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
==2000 దశాబ్ద చరిత్ర==
డిసెంబరు 2005 నాటికి, [[ఉదయ భాను]] వ్యాఖ్యాతగా గోల్డ్ రష్(గేమ్ షో), నిశ్శబ్దం అనే ధారావాహిక ప్రసారమయ్యేవి. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో వారపు రోజుల్లో 1.24%, వారాంతాల్లో 1.86% షేర్ మాత్రమే సాధించగలిగింది. దాంతో, లక్ష్యాన్ని మాస్ ప్రేక్షకుల నుంచీ యువ ప్రేక్షకులకు మార్చుకుని, కొత్త కార్యక్రమాలను రూపొందించింది.<ref name="IndianTelevision20051215"/><ref>{{citation|url=http://www.hindu.com/mp/2005/07/02/stories/2005070202820400.htm|periodical=The Hindu|date=2007-07-02|accessdate=2008-03-21|title=Get set for 'Gold Rush'|last=Singh|first=T. Lalith}}</ref> ఈ నెట్వర్క్, 2007కు గానూ దాదాపు 460 మిలియన్ రూపాయల నష్టాన్ని భరించింది.<ref name="IndianTelevision20060706"/>
 
2006 ఆఖర్లో, జీ తెలుగు చానెల్ ''స రి గ మ ప '' అనే తెలుగు సంగీత పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. [[నంది అవార్డు]] గ్రహీత గాయని [[సునీత ఉపద్రష్ట]] వ్యాఖ్యాతగా, ప్రముఖ సంగీత దర్శకులు [[రాజ్ - కోటి|కోటి]], [[రమణ గోగుల]]లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం 35 ఎపిసోడ్ల పాటు ప్రసారం చేశారు.<ref>{{citation|url=http://www.hindu.com/mp/2007/10/31/stories/2006103100630300.htm|date=2006-10-31|accessdate=2008-03-21|periodical=The Hindu|title=A talent hunt for singers}}</ref> ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైంది అంటే ఫిబ్రవరి 2007లో 6-13 ఏళ్ళ వయసు గల చిన్నపిల్లల సంగీత పోటీ కార్యక్రమం ''లిటిల్ చాంప్స్ '' కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడెల్ రన్నర్ అప్ [[ఎన్. సి. కారుణ్య|కారుణ్య]] వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.<ref>{{citation|url=http://www.hindu.com/2007/02/20/stories/2007022004080200.htm|periodical=The Hindu|date=2007-02-20|accessdate=2008-03-21|title= It's 'no acting, only singing' for Karunya; To anchor a music show on a Telugu television channel soon}}</ref>
 
==మూలాలు==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762238" నుండి వెలికితీశారు