హలో గురు ప్రేమకోసమే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
== కథ ==
సంజు ([[రామ్ పోతినేని]]) [[కాకినాడ]]కు చెందిన గ్రాడ్యుయేట్. బాధ్యతలు ఇంకా వంటబట్టని యువకుడు. అతని జీవితం అంతా తను ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రుల చుట్టూ, స్నేహితుల చుట్టూ అల్లుకుని ఉంటుంది. మొదటినుంచీ అతనికి ఉద్యోగం కోసం తన ఊరును వదిలి, [[హైదరాబాద్]]కు వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే తల్లిదండ్రులకు తాను మంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిరపడాలని కోరికగా ఉందని తెలుసుకుని హైదరబాద్ వెళ్ళేందుకు ఒప్పుకుంటాడు. హైదరాబాద్ లో సంజు తల్లి గాయత్రి([[సితార (నటి)|సితార]]) తన స్నేహితుడు విశ్వనాథ్([[ప్రకాష్ రాజ్]]) ఇంట్లో ఉండటానికి ఏర్పాటు చేస్తుంది.
 
హైదరాబాద్ కు ట్రైన్ లో వెళ్తుండగా, సంజు అనుపమ([[అనుపమ పరమేశ్వరన్]])ను కలుస్తాడు. అంతకుముందు స్టేషన్ లో కాకినాడ అబ్బాయిలు ఆకతాయిలు అన్న అనుపమ మాట విని, ఆమెను ట్రైన్ లో ఏడిపిస్తాడు సంజు. ఆ తరువాత, తను ఉండాల్సిన ఇంటి యజమాని విశ్వనాధ్ కూతురే అనుపమ అని తెలుసుకుని ఇబ్బంది పడతాడు. పైగా ప్రతీరోజూ ఆమెను కాలేజీకి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా అతని మీదే పడుతుంది. మొదట్లో ట్రైన్ లో సంజు చేసిన ఆకతాయి పనులకు అతనిపై ద్వేషం పెంచుకున్న అనుపమ, తరువాత అతని కుటుంబంపై అతనికి ఉన్న ప్రేమ, అభిమానాలు తెలుసుకుని కాస్త మెత్తపడుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు. సంజూ కూడా విశ్వనాథ్ మాటపై నిలబడే తత్త్వం గురించీ, చనిపోతున్న స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం అతని కూతుర్ని డాక్టర్ ని చదివించడం, దాని కోసం తన కూతుర్ని డాక్టర్ చదివించలేక, బీటెక్ లో చేర్చడం గురించి తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు.
 
== మూలాలు ==