"హలో గురు ప్రేమకోసమే" కూర్పుల మధ్య తేడాలు

హైదరాబాద్ కు ట్రైన్ లో వెళ్తుండగా, సంజు అనుపమ([[అనుపమ పరమేశ్వరన్]])ను కలుస్తాడు. అంతకుముందు స్టేషన్ లో కాకినాడ అబ్బాయిలు ఆకతాయిలు అన్న అనుపమ మాట విని, ఆమెను ట్రైన్ లో ఏడిపిస్తాడు సంజు. ఆ తరువాత, తను ఉండాల్సిన ఇంటి యజమాని విశ్వనాధ్ కూతురే అనుపమ అని తెలుసుకుని ఇబ్బంది పడతాడు. పైగా ప్రతీరోజూ ఆమెను కాలేజీకి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా అతని మీదే పడుతుంది. మొదట్లో ట్రైన్ లో సంజు చేసిన ఆకతాయి పనులకు అతనిపై ద్వేషం పెంచుకున్న అనుపమ, తరువాత అతని కుటుంబంపై అతనికి ఉన్న ప్రేమ, అభిమానాలు తెలుసుకుని కాస్త మెత్తపడుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు. సంజూ కూడా విశ్వనాథ్ మాటపై నిలబడే తత్త్వం గురించీ, చనిపోతున్న స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం అతని కూతుర్ని డాక్టర్ ని చదివించడం, దాని కోసం తన కూతుర్ని డాక్టర్ చదివించలేక, బీటెక్ లో చేర్చడం గురించి తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు.
 
తన ఆఫీస్ లో పనిచేస్తున్న రీతు([[ప్రణీత సుభాష్]]) పై ఇష్టం పెంచుకుంటాడు సంజు. ఈలోపు అనుతో స్నేహం మరింత బలపడుతుంది. ఐతే రీతు, సంజుకి తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు, తనకు అనుపై ఉన్న ప్రేమను తెలుసుకుంటాడు. ఇన్నాళ్ళూ తెలీకుండానే ఆమెపై ప్రేమ పెంచుకున్నానని అర్ధం చేసుకుంటాడు. తన ప్రేమను చెప్పాలనుకుంటున్న సమయంలోనే విశ్వనాథ్ అనూకి కార్తీక్(నోయెల్ సియన్)తో పెళ్ళి నిశ్చయం చేస్తాడు.
 
అయితే విశ్వనాథ్, సంజు స్నేహితులు అవుతారు. సంజూ హైదరాబాద్ లో ఉన్నన్నాళ్ళూ తను స్నేహితునిగా అన్ని విషయాల్లోనూ సాయం చేస్తానని విశ్వనాథ్ మాటిస్తాడు. ఈలోపు తన అనూపై తన ప్రేమను తెలుసుకున్న సంజు ఈ విషయం విశ్వనాథ్ కు చెప్తాడు. ఇప్పుడు విశ్వనాథ్ ఇరకాటంలో పడతాడు. తన మాట నిలబెట్టుకుని ప్రేమ విషయంలో సంజూకి సాయం చేయడమా, లేక అనూకి తండ్రిగా వ్యవహరించడమా అని. అతనికి సాయం చేస్తూనే, అనూని అతనికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని సరదా సంఘటనల తరువాత, తను కూడా సంజూని ప్రేమిస్తున్నానని అనూకి అర్ధమై, అతనికి తన ప్రేమ వ్యక్తం చేస్తుంది. తన తండ్రి ఇచ్చిన మాటపై నిలబడి కార్తీక్ కి ఇచ్చి పెళ్ళి చేస్తాడేమో అన్న భయంతో, ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోమని సంజూని అడుగుతుంది. ఈ విషయం తెలిసిన విశ్వనాథ్ కూడా ఆమెను ఎక్కడికైన తీసుకుపొమ్మనీ, తను ఇచ్చిన మాట దాటలేనని సంజూతో చెప్పి, బాధపడతాడు. కానీ విశ్వనాథ్ అంచనాలు తారుమారు చేస్తూ, సంజూ ఇల్లు వదిలి, కాకినాడ ఒంటరిగా వెళ్ళిపోతాడు. వెళ్తూ తాను విశ్వనాథ్ ను బాధపెట్టలేననీ, ఎప్పటికీ అతనికి మంచి స్నేహితునిగానే ఉండిపోతాననీ, అనూకి ఏది మంచో తండ్రిగా విశ్వనాథ్ కే బాగా తెలుసు అని ఉత్తరం రాసి వెళ్ళిపోతాడు. అయితే కొంతకాలం తరువాత విశ్వనాథ్ కాకినాడ వచ్చి, అనూని సంజూ కంటే ఎవరూ బాగా చూసుకోలేరని చెప్పి, వాళ్ళిద్దర్నీ పెళ్ళి చేసుకోమని తన అనుమతి తెలపడంతో కథ సుఖాంతం అవుతుంది.
 
== మూలాలు ==
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762337" నుండి వెలికితీశారు