ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్: కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పులు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 141:
 
== నాయకత్వం ==
ఐఎస్ బృందానికి నాయకుడిగా అబు బకర్ అల్ - బాగ్దాదీ వ్యవహరిస్తున్నాడు. ఆ బృందం ఆయనను ఖలీఫాగా భావిస్తుంది ఇతన్ని వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలో అమెరికా సేనలు , సైనిక శునకాలుత వెంబడించటంవలన రహస్య సొరంగ మార్గం ద్వారా భూగృహం(బంకర్‌) లొ తన శరీరానికున్న బాంబుల జాకెట్‌ను పేల్చుకుని 27 అక్టోబర్ 2019 న బాగ్దాదీ చనిపోయాడు. ఆయన కింద ఇద్దరు ప్రధాన ఉపనాయకులు ఉండేవారు. ఇరాక్ లో అబు ముస్లిం అల్ - తుర్కమనీ, సిరియాలో అబు అలీ అల్ - అన్బరీ. వీరు కాక పలువురు ఇతర నాయకులు అల్ బాగ్దాదీకి ఆర్థిక, సైనిక, నాయకత్వ, చట్టపరమైన అంశాల్లో సలహాలిచ్చేందుకు కృషి చేస్తారు. వారి కింద వివిధ మండళ్లు, స్థానిక నాయకులు ఉన్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఐఎస్ లోని నాయకులందరూ దాదాపుగా గతంలో ఇరాక్ లో సైనిక, నిఘా విభాగాల్లో పని చేసిన వారే. ముఖ్యంగా చాలా మటుకు సద్దాం హుసేన్ పాలనలో ఆయన నాయకత్వంలోని బాత్ పార్టీ ప్రభుత్వం కింద పని చేసిన వారే. ఆయన ప్రభుత్వాన్ని పాశ్చాత్య దేశాలు పడగొట్టిన తర్వాత వారంతా ఇలాంటి కార్యక్రమాల వైపు మళ్లి చివరకు ఐఎస్ లోకి చేరుకున్నారు. అందుకే పశ్చిమ దేశాలు ఇరాక్ పై దురాక్రమణ జరపకపోతే ఐఎస్ బృందం ఏర్పడి ఉండేదే కాదని అమెరికాలోని పలువురు విశ్లేషకులు, తీవ్రవాద వ్యతిరేక సంస్థల్లో నిపుణులు (డేవిడ్ కిల్ కులన్ వంటి వారు) పేర్కొన్నారు. ఇరాక్ వారితో పాటు సిరియాకు చెందిన పలువురు నాయకులు కూడా ఐఎస్ లో ఉన్నారు. స్థానిక సున్నీలు ఉండడం వల్ల అక్కడ తమ పోరాటం ఎక్కువ కష్టం లేకుండా జరుగుతుందని భావించిన ఐఎస్ నాయకత్వం స్థానిక నాయకులనే ఎక్కువగా ఆయా పదవుల్లో నియమించింది. ఐఎస్ లో వివిధ స్థాయులు గల నిఘా/గూఢచార వ్యవస్థ కూడా ఉందనీ, అది 2014 నించీ పని చేస్తోందనీ 2016 ఆగస్టులో వెలువడిన పలు మీడియా వార్తలు వెల్లడించాయి. దీనికి సిరియాకు చెందిన సీనియర్ ఐఎస్ నాయకుడు అబు మహమ్మద్ అల్ - అద్నానీ నాయకత్వం వహిస్తున్నాడు.
 
2014 లో ఐఎస్ ఆధిపత్యం కింద గల ప్రాంతాల్లో ఎనిమిది మిలియన్ల మంది సామాన్య ప్రజలు నివసిస్తున్నట్టు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక లెక్కగట్టింది. వీరిని తమ కఠిన నియంత్రణ కింద ఐఎస్ ఉంచుతుందనీ, తమ మాట పాటించే వారికే వివిధ సేవలు అందేలా చూస్తుందనీ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమీషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ప్రజలు ఐఎస్ అనుసరించే షరియా చట్టాన్ని పాటించి తీరాలి.
 
== సైనికులు ==