వైఖానసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
[[File:Priests performing Yagnya as part of Kumbhaabhishekam at Gunjanarasimhaswamy Temple, T. Narasipur.jpg|thumb|right|250px|వైఖానస బ్రాహ్మణులు వైదిక పద్ధతిలో యాగం చేస్తూ..., గుంజనరసింహస్వామి ఆలయం, నర్సీపుర, కర్నాటక]]
[[శ్రీవైష్ణవం]], [[శైవం]], [[మధ్వాచార్యుడు|మాధ్వం]] లాగానే '''వైఖానసం''' కూడా [[హిందూమతము|హిందూ సాంప్రదాయా]]ల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు [[విష్ణువు]]ని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ [[యజుర్వేదం|యజుర్వేద]] తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే [[బ్రాహ్మణులు]]. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన [[విఖనస ఋషి]] నుండి వస్తుంది. ఈ మతం [[ఏకేశ్వరోపాసన|ఏకేశ్వర]] భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే [[తిరుమల]] [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన [[వైఖానస ఆగమం]].<ref>[httphttps://www.vaikhanasavaikhanasam.com/vaikhanasam.html వైఖానసం జాలగూడు]</ref>
==చరిత్ర==
వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా [[మనుస్మృతి|మనుధర్మశాస్త్రం]]లో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన [[వానప్రస్థం]] ఇంకా [[సన్యాసాశ్రమం]] గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. [[నారాయణీయం]]లో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక [[దేవాలయం]]లో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. [[శ్రీవైష్ణవం|శ్రీవైష్ణవుల]] రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుడి]] రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా [[శూద్రులు|శూద్రు]]లకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.
పంక్తి 22:
 
==మూలములు==
https://www.vaikhanasam.com
<references/>
 
"https://te.wikipedia.org/wiki/వైఖానసం" నుండి వెలికితీశారు