అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
తర్వాత [[ఢిల్లీ]] నుండి పరిపాలన చేస్తున్న [[అల్లావుద్దీన్ ఖిల్జీ]] దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రంను కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారంనకు కాపలాగా ఉన్న [[హరిహరరాయలు]], బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది.
 
1677 లో అనంతపురం జిల్లా మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్దతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని [[కదిరి]],[[ముదిగుబ్బ]],[[నల్లమాడ]],[[నంబులిపులికుంట]],[[తలుపుల]],[[నల్లచెరువు]], [[ఓబులదేవరచెరువు]],[[తనకల్లు]],[[ఆమడగూరు]] మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి.తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న [[రాయదుర్గం]], [[డి.హిరేహాల్|డి.హిరేహాల్,]] [[కణేకల్లు]], [[బొమ్మనహళ్]], [[గుమ్మగట్ట]] ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.<ref>[{{Cite web |url=http://www.sundarayya.org/pdf2/%E0%B0%85%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%20%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%20%E0%B0%95%E0%B0%A5.pdf |author=కలవటాల జయరామారావు రచించిన |title=అనంతపురం జిల్లా చరిత్ర |date=1928 ముద్రితం,|printer= శ్రీరాజరాజేశ్వరీ నికేతన ముద్రాక్షరశాల, మద్రాసు}} </ref>
[[Andhravijnanasarvasvamupart2.pdf/10]] అను గ్రందములోని 4 వ పుటలో అనంతపురము చరిత్ర ఈ విధముగా నున్నది.
</ref>
 
== భౌగోళిక స్వరూపం ==
అనంతపురం జిల్లాకు ఉత్తరాన [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[వైఎస్ఆర్ జిల్లా]],[[కడప]], ఆగ్నేయమున [[చిత్తూరు]] జిల్లా, పశ్చిమాన మరియు నైఋతిన [[కర్ణాటక]] రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తరాన మధ్యభాగంలో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగం ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. [[పెన్నా]], [[చిత్రావతి]], [[వేదవతి]], [[పాపాఘ్ని]], [[స్వర్ణముఖి]], [[తడకలూరు]] మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురుస్తుంది. [[రాజస్థాన్]] లోని [[జైసల్మేర్ జిల్లా|జైసల్మేరు]] తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు