షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
 
1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నాడు. యాచన అతని వృత్తి. మసీదులో [[ధుని]]ని వెలిగించాడు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవాడు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవాడు. చాలా మహత్తులు చూపించేవాడని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవాడు. ఉత్సవాలలో పాల్గొనేవాడు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవాడు.<ref>"That Shirdi Sai Baba was eccentric is well-attested, for it seems that he was sometimes of uncouth and violent behaviour." In {{cite book | last = Bowen | first = David | title = The Sathya Sai Baba Community in Bradford: Its origins and development, religious beliefs and practices | publisher = Leeds: University Press | date= 1988 | pages = 135}}</ref><ref>"Of unpredictable moods, devotees remember him as both loving and harsh. When he got angry, often for no apparent reason, he would scream or abuse people, sometimes for hours at an end, at times even tearing off his own clothes." In {{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = xxxiii | isbn = 0791412687}}</ref>
 
[[1910]] తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.<ref>Ruhela ''Sri Shirdi Sai Baba - The Universal Master'' p. 65-72</ref> [[అక్టోబరు 15]], [[1918]] మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో కన్ను మూశాడు (మహా సమాధి చెందాడు). అతని దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapters 42, 43, 44 [http://www.saibaba.org/satcharitra/sai42.html] [http://www.saibaba.org/satcharitra/sai43_44.html]</ref>
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు