"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల,1950లో అప్పటి వెనుకబడిన [[పల్నాడు]], [[తెలంగాణ]], [[రాయలసీమ]] ప్రాంతాల విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో నరసారావుపేటలో ఒక చిన్న సంస్థగా తొలుత రైల్వే స్ఠేషన్ ఎదురుగా ఉండే కాటన్ ప్రెస్‌కంపెనీలో ప్రారంభించింది.తదుపరి కళాశాల 34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన శాశ్వత భవనాలలోకి మారింది. కళాశాల మొదటి ప్రిన్సిపల్ ఇలింద్ర రంగనాయకులు.ఈ కళాశాల ప్రిన్సిపల్‌గా రాకపూర్వం గుంటూరు హిందూ కళాశాలలో గణితశాస్ర ఆచార్యుడుగా పనిచేశాడు.మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది.ఇది వివిధ విద్యా రంగాలలో పరిమాణాత్మక విస్తరణ, గుణాత్మక మెరుగుదలల ద్వారా మంచి పురోగతిని సాధించిందించిదని అంటారు.2019 నాటికి కళాశాల కమిటీ ప్రెసిడెంటుగా కపిలవాయి విజయ కుమార్, సెక్రటరీ, కరస్పాండెంట్‌గా నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపాల్‌గా సోము మల్లయ్య వ్యవహరిస్తున్నారు.
 
=== శ్రీ యస్.కె.ఆర్.బి.ఆర్.జూనియర్ కళాశాల. ===
శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాల 1972 సంవత్సరంలో 23.5 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది. ఈ కళాశాల పల్నాడు రోడ్డులో పట్టణం నడిబొడ్డున ఉంది. కళాశాల శాశ్వత భవనాలను కలిగిఉంది.విద్యార్థుల విద్యా రంగంలో అభివృద్ధిని సాధించటానికి అన్ని విధాల సౌకర్యాలను కలిగి ప్రశాంత వాతావరణంతో కలిగిన విశాలమైన లైబ్రరీ, పూర్తిస్థాయి ప్రయోగశాలలు,విద్యా వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి.క్రీడా ప్రాంగణంలో, వ్యాయామశాలలో వివిధ సౌకర్యాలు ఉన్నాయి.ఎప్పటికప్పుడు చురుకైన యన్.సి.సి, యన్.యస్.యస్, సాంస్కృతిక క్లబ్‌లు సంవత్సరవారీ జరుగవలసిన కార్యక్రమాల వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. విద్యార్థులు ఎల్లప్పుడూ కార్యకలాపంలలో లేదా మరొక పనిలో నిమగ్నమై ఉండే విధంగా తగు పర్వేక్షణ ఉంటుంది.విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవటానికి, ఉపన్యాసాలు ఇచ్చే స్థాయి విద్యార్థులలో కలిగింపచేయాలనే కోరిక ప్రస్తుతం యాజమాన్యానికి ఉంది.కళాశాల లక్ష్యం కష్టపడి పనిచేయడం, మాంటిస్సోరిని మాస్టర్స్ అంతకు మించి ఒకే గొడుగు క్రిందకు తీసుకురావలనే ఆకాంక్షతో ఉంది.విద్యలో ఆధునిక పోకడలతో పోటీ పడటానికి సరికొత్త కోర్సులు, మార్పుల నిరంతరం జోడించబడ్తుంటాయి.కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ, కరస్పాండెంట్ నరసరావుపేట మాజీ యం.యల్.ఎ. దొండేటి కృష్ణారెడ్డి.వ్యవస్థాపక ప్రిన్సిపాల్ యస్.వెంకటేశ్వరరావు.ప్రస్తుత వ్యవస్థాపక సెక్రటరీ,కరస్పాండెంట్ గా కాసు మహేశ్వరరెడ్డి, ప్రస్తుత వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా టి.జె.చంద్రశేఖర్ బాబు పనిచేయుచున్నారు.కళాశాల ప్రాంగణంలోని బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సేవలు అందిస్తుంది.
 
కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం యొక్క అధ్యయన కేంద్రం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సేవలను అందిస్తుంది.
 
===పి.యన్.సి. & కె.ఆర్. విద్యా సంస్థలు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2766999" నుండి వెలికితీశారు