"శంకరంబాడి సుందరాచారి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
'''సుందర రామాయణం''' అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే '''సుందర భారతం''' కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా '''శ్రీనివాస శతకం''' రచించాడు. ఇవే కాక ''జపమాల'', ''బుద్ధగీతి'' అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.
 
రవీంద్రుని '''[[గీతాంజలి]]'''ని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ''[[ఏకలవ్యుడు]]'' అనే [[ఖండకావ్యం]], ''కెరటాలు'' అనే గ్రంథం కూడా రచించాడు. ''సుందర సుధా బిందువులు'' అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. ''[[జానపద గీతాలు]]'' వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.
 
సినిమాలకు కూడా పాటలు రాసాడు. [[మహాత్మాగాంధీ (1941 సినిమా)|మహాత్మాగాంధీ]], [[బిల్హణీయం]], [[దీనబంధు]] అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. సుందరాచారి "మా తెలుగు తల్లికి" గీతాన్ని [[1942]]లో [[దీనబంధు]] సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. [[టంగుటూరి సూర్యకుమారి]] గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
606

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2767381" నుండి వెలికితీశారు