"కుమారభీమారామము" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
 
== ఆలయం ==
ఇక్కడ [[ఆలయం]]<nowiki/>లోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు [[బాలాత్రిపురసుందరి]]గా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. [[దేవాలయం]] లోపలి ప్రాకారంలో [[వినాయకుడు]], కాల భైరవుడు, [[వీరభద్రుడు]], మహాకాళి, [[శని|శనేశ్వరుడు]], [[నవగ్రహాలు]] కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి [[శివ లింగము|శివలింగం]] నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. స్వామివారికి(ఇదే కథ ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలోని పెదబ్చీరహ్మమదేవం పొలాలలో నెలవైన మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుని విషయంలోను వినబడుతూ ఉంది.) ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో [[నందీశ్వరుడు]] ఆశీనుడైఆసీనుడై ఉంటాడు.
 
గుడిలో స్వామి వారికి ఎదురుగా [[మండపం]]లో వున్న [[నంది|నంది విగ్రహం]] ఏక శిలచే చెక్కబడింది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. [[భక్తులు]] [[పూజలు]], అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి<ref>http://indiankshetras.com/Kumararama-temple-Pancharama-Kshetras-Bhimarama-Shiva-Samarlakota-Godavari-Andhra%20Pradesh-India</ref>
 
ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన [[ద్రాక్షారామం]]లోని భీమేశ్వరాలయాన్ని పోలివుండును.అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది.ప్రాకారాపు [[గోడలు]] ఇసుక రాయి (సsand stone) చే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్థంబాలస్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమరరామకుమారారామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది<ref>http://www.templesindia.org/index.php?option=com_content&view=article&id=119:sri-chalukya-kumararama-sri-bhimeswaraswamy-vari-temple-samarlkota-&catid=35:temples-in-andhra-pradesh&Itemid=62</ref>
=== ఉత్సవాలు పూజలు ===
ఇక (చైత్రమాసము) (చైత్ర) [[వైశాఖి|వైశాఖ]] మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. [[మహాశివరాత్రి|శివరాత్రి]]<nowiki/>కి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలాత్రిపురసుందరికిబాలత్రిపురసుందరికి [[వైభవం]]<nowiki/>గా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక [[కార్తీకకార్తిక మాసం]]లో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ [[భక్తులు]] పునీతులవుతుంటారు.
 
== ప్రయాణ వసతులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2772059" నుండి వెలికితీశారు