"కుమారభీమారామము" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
 
== ఆలయం ==
ఇక్కడ [[ఆలయం]]<nowiki/>లోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు [[బాలాత్రిపురసుందరి]]గా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. [[దేవాలయం]] లోపలి ప్రాకారంలో [[వినాయకుడు]], కాల భైరవుడు, [[వీరభద్రుడు]], మహాకాళి, [[శని|శనేశ్వరుడు]], [[నవగ్రహాలు]] కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి [[శివ లింగము|శివలింగం]] నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. (ఇదే కథ ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలోని పెదబ్చీరహ్మమదేవంపెదబ్రహ్మదేవం పొలాలలో నెలవైన మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుని విషయంలోను వినబడుతూ ఉంది.) ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో [[నందీశ్వరుడు]] ఆసీనుడై ఉంటాడు.
 
గుడిలో స్వామి వారికి ఎదురుగా [[మండపం]]లో వున్న [[నంది|నంది విగ్రహం]] ఏక శిలచే చెక్కబడింది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. [[భక్తులు]] [[పూజలు]], అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి<ref>http://indiankshetras.com/Kumararama-temple-Pancharama-Kshetras-Bhimarama-Shiva-Samarlakota-Godavari-Andhra%20Pradesh-India</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2772060" నుండి వెలికితీశారు