మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. [[1830]]లో యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ ప్రాంతాన్ని సందర్శించి తన [[కాశీయాత్ర చరిత్ర]]లో మూసీ గురించి, దాని వరదల గురించి వ్రాసుకున్నాడు. ఆయన [[1829]]లో మూసీనదికి గొప్ప వరదలు వచ్చాయని వ్రాశారు. ఢిల్లీ దర్వాజా వద్ద ఆంగ్లేయులు నిర్మించిన వారధిని ఆ వరద ప్రవాహం పగలగొట్టి, బేగంబజారులో కొన్ని వీధులను ముంచి పోయిందని వ్రాశాడు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> [[1908]] [[సెప్టెంబరు 28]], మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.
 
నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], వరదల పునరుక్తిని నివారించడానికి మరియు నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబరు 1న తన నివేదిక సమర్పించాడు. [[ఉస్మాన్ ఆలీ ఖాన్|ఏడవ నిజాం]] 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. [[1920]]లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన [[ఉస్మాన్ సాగర్]] ఆనకట్టను కట్టించారు. [[1927]]లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై [[హిమాయత్ సాగర్]] అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.we should protect the musi Nadi as a indian I will do it
 
==మురికి కాలువ మూసీ==
"https://te.wikipedia.org/wiki/మూసీ_నది" నుండి వెలికితీశారు